ఇండోనేసియా సదస్సులో ‘మిషన్‌ కాకతీయ’ 

5 Sep, 2019 03:19 IST|Sakshi

చెరువుల పునరుద్ధరణ ఫలితాలపై ప్రశంసలు

సాక్షి, హైదరాబాద్‌: చెరువుల పునరుద్ధరణ కోసం చేపట్టిన మిషన్‌ కాకతీయ ఫలితంగా తెలంగాణలో జరిగిన సామాజిక, ఆర్థిక, వ్యవసాయ వృద్ధిపై అంతర్జాతీయంగా ప్రశంసలు దక్కాయి. రాష్ట్ర ప్రగతికి, గ్రామీణ వ్యవసాయానికి పట్టుగొమ్మల్లాంటి చిన్ననీటి వనరుల అభివృద్ధి ఇతర దేశాలకు ఆదర్శనీయంగా ఉందనే అభిప్రాయం వ్యక్తమైంది. అంతర్జాతీయ స్థాయిలో మూడేళ్లకోసారి ఇంటర్నేషనల్‌ కమిషన్‌ ఆన్‌ ఇరిగేషన్‌ అండ్‌ డ్రైనేజీ (ఐసీఐడీ) నిర్వహించే సదస్సు ఈసారి ఇండోనేసియాలోని బాలిలో జరగగా, ఈ సదస్సుల్లో మిషన్‌ కాకతీయపై కీలక పత్రాలను సమర్పించే అవకాశం తెలంగాణకు దక్కింది. దీంతోపాటు నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు ఆధునీకరణ, శ్రీరామ్‌సాగర్‌ ప్రాజెక్టులో నీటి వినియోగ సామర్థ్యం అంశాలపై పత్రాలు సమర్పించగా, వీటిపై చీఫ్‌ ఇంజనీర్లు హమీద్‌ ఖాన్, శంకర్, నర్సింహ, సీఎం ఓఎస్‌డీ శ్రీధర్‌రావు దేశ్‌పాండేలు హాజరై రాష్ట్రం తీసుకున్న జల సంరక్షణ చర్యలపై మాట్లాడారు.

రాష్ట్రంలోని సుమారు 40 వేలకు పైగా ఉన్న చెరువుల పునరుద్ధరణ, పూడికతీత, ఆ మట్టిని పొలాలకు తరలింపు, నీటి సామర్థ్యం పెంపు చర్యలు, గొలుసుకట్టు చెరువుల అభివృద్ధి ద్వారా నీటి సంరక్షణ తదితర అంశాలపై శ్రీధర్‌ దేశ్‌పాండే వివరించారు. చెరువుల పునరుద్ధరణతో ప్రస్తుతం 20 లక్షల ఎకరాలకు పైగా ఆయకట్టు సాగులోకి వచ్చిందని తెలిపారు. దీనిపై ఐసీఐడీ సదస్సు ప్రశంసలు కురిపించింది. ఇక సాగర్, ఎస్సారెస్పీ కాల్వల ఆధునీకరణతో చివరి ఆయకట్టు వరకు సాగునీటి వినియోగం, నీటి సరఫరాలో వ్యత్యాసాల తగ్గింపు, నీటి వృ«థాకు అడ్డుకట్ట ఎలా జరిగిందన్న అంశాలపై నరసింహ, శంకర్‌లు ఈ సదస్సులో వివరించారు.  
 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

హైకోర్టులో న్యాయవాదుల నిరసన

8న కొత్త గవర్నర్‌ బాధ్యతల స్వీకరణ

సర్కారు ఆస్పత్రులకు గుర్తింపు

దోస్త్‌ ఫారిన్‌ పోవొద్దని...

దత్తన్న ఇంట్లో కత్తి కలకలం

ఈనాటి ముఖ్యాంశాలు

ప్రభుత్వ తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకే..

'ఆ బాంబు బెదిరింపు నకిలీయే' 

‘నాకు పార్టీలో అన్యాయం జరిగింది’

కళ్లకు గంతలు కట్టుకున్నారా..?

జూరాల జలాశయానికి పెరుగుతున్న వరద నీరు

ప్రాజెక్టులు పూర్తయితే.. పూడికతీత ఎలా సాధ్యమైంది..!

చంద్రబాబుకు చెప్పే పార్టీ మారాను : రేవూరి

జ్వరాలన్నీ డెంగీ కాదు..

బీజేపీలో చేరిన రేవూరి, రవీంద్ర నాయక్‌

చెరుకు ముత్యంరెడ్డి అంత్యక్రియలు పూర్తి

రేపు నీళ్లు బంద్‌..

దోమలపై డ్రోనాస్త్రం

8న తమిళసై, 11న దత్తాత్రేయ ప్రమాణం

భారీ భద్రత

పడకేసిన ‘ఈ–ఆఫీస్‌’

తప్పులను సరిచేసుకోండి

ఫీవర్‌కు పెరుగుతున్నరోగుల తాకిడి

సరుకుల రవాణాకు ‘ఈ–పర్మిట్‌’

లిక్విడ్స్‌తో వర్కవుట్స్‌

పీవీ సింధు ప్రత్యేక పూజలు

ఆనందాన్ని అనుభవించాలి..

రెండవ రోజు హైకోర్టు న్యాయవాదుల ఆందోళన

వలలో చిక్కిన కొండ చిలువ

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘టి మా’ అభివృద్ధికి కృషి చేస్తా

వెండితెర గురువులు

మానవతా దృక్ఫథం చాటుకున్న హీరో

‘నా పాత్రలో ఆమె నటిస్తే బాగుంటుంది’

హైదరాబాద్‌కు మారిన ‘కేజీఎఫ్‌-2’

యాక్షన్‌... కట్‌