కమ్యూనిస్టు పార్టీలోనూ ప్రజాస్వామ్యం లేదు

9 Nov, 2018 15:29 IST|Sakshi

నాడు స్థిరమైర రాజకీయ అభిప్రాయాలుండేవి

ప్రస్తుతం ఎప్పుడు.. ఏ పార్టీలో ఉంటున్నారో తెలియడంలేదు   

‘సాక్షి’తో మాజీ ఎమ్మెల్యే కట్టా వెంకటనర్సయ్య

సాక్షి,మధిర: చిన్నతనంనుంచి ఆయన కమ్యూనిస్టు సిద్ధాంతాలను పుణికిపుచ్చుకున్నారు. పుచ్చలపల్లి సుందరయ్య, బోడపూడి వెంకటేశ్వరరావు అడుగు జాడల్లో పయనించారు. మధిర నియోజకవర్గం నుంచి ఆయన రెండుసార్లు గెలుపొందారు. ప్రతీ గ్రామానికి రహదారుల నిర్మాణం చేపట్టి ప్రజాభిమానాన్ని చూరగొన్న శాసన సభ  ఎన్నికల సందర్భంగా ‘సాక్షి’తో  మాట్లాడారు.  

సాక్షి: ప్రస్తుతం రాజకీ యాల్లో కొనసాగుతున్నారా? 
కట్టా: పదేళ్ల క్రితం సీపీఎంకు రాజీనామా  చేసి రాజకీయాల నుంచి తప్పుకున్నాను. జరగబోయే ఎన్నికల్లో నేను ఎవరికీ మద్దతు ప్రకటించలేదు. నేను మొదటినుంచి కమ్యూనిస్టు సిద్ధాంతాలను నమ్ముకున్నా. నా ప్రాణం ఉన్నంతవరకు కమ్యూనిస్టుగానే కొనసాగుతా. కొంతమంది మద్దతు తెలిపినట్లు ప్రచారం చేసుకుంటున్నారు. అది చాలా తప్పు. మద్దతు ఇస్తే నేనే స్వయంగా ప్రకటిస్తా. కానీ అటువంటి ఆలోచనే లేదు.
  
సాక్షి:  రాజకీయ వ్యవస్థలో వస్తున్న మార్పులు ఏమిటీ? 
కట్టా: రానురాను పాలకవర్గాలు ఓటర్లలో ఉన్నటువంటి రాజకీయ అభిప్రాయాలను దిగజార్చాయి. స్థిరమైన రాజకీయ అభిప్రాయాలు నాడు ఎక్కువగా ఉండేవి. ప్రస్తుతం కమ్యూనిస్టు పార్టీలోకానీ, బూర్జువా పార్టీల్లోకానీ ప్రజాస్వామ్యం కోల్పోయింది. సైద్ధాంతిక, సామాజిక పరిస్థితులను ప్రజలకు వివరించి ప్రజలు వాటిమీద ప్రభావితం చేసేవిధంగా రాజకీయ పరిస్థితులు ఉండేవి. కానీ నేడు గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు పనిచేస్తున్నారు. ఎప్పుడు ఎవరు ఏ పార్టీలో ఉంటున్నారో తెలియడంలేదు. ఇప్పుడు డబ్బు ప్రభావం పీక్‌ స్టేజ్‌లోకి వచ్చింది.
  
సాక్షి: అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజలకు చేరుతున్నాయా? 
కట్టా: సంక్షేమ పథకాల పేరుతో డబ్బు బాగా ఖర్చవుతోంది. కొంత వృథా చేస్తున్నారు. ప్రణాళికాబద్ధంగా అమలు జరగడంలేదు. పాత మధిర నియోజకవర్గంలో 162 గ్రామాలు ఉండేవి. నా హయాంలో అన్ని గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టాం.

మరిన్ని వార్తలు