హైదరాబాద్‌లో డీమార్ట్‌ సీజ్‌

15 Apr, 2020 09:22 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కరోనా విజృంభిస్తున్న వేళ నిబంధనలు పాటించని ఎల్‌బీ నగర్‌ డీమార్ట్‌కు జీహెచ్‌ఎంసీ విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు షాకిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూచించిన భౌతిక దూరం నిబంధనలను యాజమాన్యం పాటించకపోవడంతో.. అధికారులు సూపర్‌ మార్కెట్‌ను సీజ్‌ చేశారు. మంగళవారం ఎల్‌బీ నగర్‌ ప్రాంతంలోని డీమార్ట్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు తనిఖీ చేయగా.. పెద్ద ఎత్తున వినియోగదారులు కనిపించారు. అయితే వినియోగదారలు సూపర్‌ మార్కెట్‌లో భౌతిక దూరం పాటించేలా యాజమాన్యం కనీస చర్యలు తీసుకోకపోవడంతో అదికారులు సదరు డీమార్ట్‌ను సీజ్‌ చేసి నోటీసులు అంటించారు. డీమార్ట్‌లో కనీసం కస్టమర్ల కోసం శానిటైజర్స్‌ కూడా యాజమాన్యం ఏర్పాటు చేయనట్టుగా తెలుస్తోంది. 

కాగా, కరోనా కట్టడిలో భాగంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతుడటంతో.. పలు షరతులతో సూపర్‌ మార్కెట్స్‌కు నిత్యావసరాల విక్రయానికి  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. సరకుల విక్రయానికి కొన్ని గంటలే అనుమతులిచ్చారు. అయితే ఈ సమయంలో భౌతిక దూరంతోపాటు.. ఇతర కరోనా నియంత్రణ చర్యలు పాటించాలని సూపర్‌ మార్కెట్స్‌ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు