నిరుపేదలకు నిత్యావసరాల పంపిణీ

19 Apr, 2020 17:21 IST|Sakshi

వినయ్ రెడ్డి సహాయానికి కృతజ్ఞతలు తెలిపిన పేదలు

నిరుపేదల ఆకలి గురించి ఆలోచన చేసిన ఆయన దాతృత్వాన్ని అభినందించిన పలువురు ప్రజాప్రతినిధులు

హైదరాబాద్‌ : ఉప్పల్ నియోజకవర్గం రామంతపూర్ డివిజన్‌లో స్థానిక ప్రతినిధి మేడిపల్లి వినయ్ రెడ్డి ఆధ్వర్యంలో 400 మంది నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ  చేశారు. కరోనా మహమ్మారి యావత్‌ ప్రపంచాన్ని పీడిస్తున్న తరుణంలో వైరస్ నియంత్రణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దినసరి కూలీ పని చేసుకునే నిరుపేదలు నిత్యావసర సరుకులు దొరక్క అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. స్థానిక నిరుపేదల ఇబ్బందులను తెలుసుకున్న వినయ్ రెడ్డి వారికి అండగా నిలుస్తూ దాతృత్వం ప్రదర్శించారు. తనవంతు సహాయంగా నిరుపేదలకు సహాయంగా ఆదివారం 400 మందికి నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో నగర మేయర్ బొంతు రామ్మోహన్, ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి, రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వారి చేతుల మీదుగా కూడా పేదలకు సరుకులు పంపిణీ చేయించారు. పేదలకు సహాయం చేయాలని సహృదయంతో ఆలోచన చేసిన వినయ్ రెడ్డిని వారు అభినందించారు. ఆయన దాతృత్వాన్ని కొనియాడారు. పేదల ఆకలి తీర్చేందుకు మరింత మంది దాతలు ముందుకు రావాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు. పెద్ద ఎత్తున జరిగిన ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి ఏసీపీ, ఉప్పల్ మున్సిపల్ డిప్యూటీ కమిషనర్, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు