భక్తిశ్రద్ధలతో మెథడిస్ట్‌ జాతర

15 Nov, 2019 10:44 IST|Sakshi
క్రీస్తు ప్రధాన శిలువ వద్ద ప్రార్థనలు చేస్తున్న భక్తులు

మూడో రోజుకు చేరిన వేడుకలు

పెరుగుతున్న భక్తుల రద్దీ 

సాక్షి, ధారూరు: ధారూరు మెథడిస్ట్‌ వేడుకలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. మంగళవారం ప్రారంభమైన క్రిస్టియన్‌ జాతర గురువారం మూ డో రోజుకు చేరుకుంది. ఈ నేపథ్యంలో కాలి నడకన వచ్చేవారి సంఖ్య అధికమవుతోంది. కర్ణాటక, మహారాష్ట్రలోని గుల్బర్గా, బీదర్, బీజాపూర్, సోలాపూర్‌ నుంచి యువతీయువకులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఇక్కడకు వచ్చి మొక్కులు తీర్చుకుంటే ఏసుక్రీస్తు తమ కోర్కెలు తీరుస్తారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ప్రధాన శిలువ వద్ద ప్రార్థనలు చేసేందుకు భక్తులు పోటీపడుతున్నారు. జాతరలో క్రీస్తు శిలువలు,  బైబిల్‌ గ్రంథాలు, జీసస్‌ చిత్ర పటాలు, బ్యానర్లు, ఫొటోలను విక్రయిస్తున్నారు. వేడుకల ప్రాంగణంలో తెలుగు, హిందీ, కన్నడ, ఇంగ్లిష్‌ భాషల్లో క్రీస్తును స్మరిస్తూ ప్రార్థనలు చేస్తున్నారు. సీఐ రాజశేఖర్‌ అధ్వర్యంలో పోలీసులు వాహనాలను నియంత్రించి పార్కింగ్‌ స్థలాలకు మళ్లిస్తున్నారు.    

మరిన్ని వార్తలు