-

ప్రకటనలు కాదు తీర్మానం చేయాలి: సీతక్క

16 Sep, 2019 03:01 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నల్లమలలో యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా అసెంబ్లీ, మండలిలో తీర్మానం చేయాలని ఎమ్మెల్యే సీతక్క డిమాండ్‌ చేశారు. ఆదివారం అసెంబ్లీ ఆవరణలో ఆమె మాట్లాడుతూ.. దేశంలోనే అధిక సంఖ్యలో పులులు సంచరించే ఆమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌ ప్రాంతానికి యురేనియం తవ్వకాలతో ముప్పు పొంచి ఉందని తెలిసి కూడా టీఆర్‌ఎస్‌ సర్కార్‌ ఎందుకు మౌనం వహించిందో చెప్పాలని నిలదీశారు. ఈ తవ్వకాల వల్ల నల్లమల నాశనమవుతుందని, తద్వారా పరిసర నదులు ప్రభావితమై ప్రజల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందన్నారు.

మరిన్ని వార్తలు