మహిళా నేతకే ఎమ్మెల్సీ పదవి?

31 Mar, 2015 01:51 IST|Sakshi

8 మంది మహిళానేతల పేర్లను కోరిన ఏఐసీసీ
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యే కోటాలో మండలి ఎన్నికలపై కాంగ్రెస్ అధిష్టానం దృష్టిసారిం చింది. త్వరలో ఖాళీ అవనున్న సీట్లలో కాం గ్రెస్‌కు దక్కనున్న ఏకైక స్థానాన్ని మహిళ తో భర్తీ చేయాలని ఏఐసీసీ నిర్ణయించినట్టు తెలుస్తోంది. అలాగే తెలంగాణ నుంచి పార్టీ జాతీయస్థాయి పదవుల్లో ముగ్గురు సీనియర్లకు అవకాశం కల్పించాలని భావిస్తోంది. ఇటీవలే  పీసీసీ అధ్యక్ష, కార్యనిర్వాహక అధ్యక్షులను మార్చిన ఏఐసీసీ.. మరిన్ని మార్పులను చేపట్టనుందని పార్టీ ముఖ్యుడొకరు వెల్లడించారు. ఎమ్మెల్యే కోటా నుంచి  పార్టీకి పూర్తికాలం పనిచేయగలిగే ఒక మహిళకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలని ఏఐసీసీ భావిస్తోంది. దీనికోసం పీసీసీ నుంచి 8మంది మహిళానేతల పేర్లతో జాబితాను పంపించాలంటూ ఆదేశించిదని సమాచారం. పార్టీకోసం ఇప్పటిదాకా పని చేసినా ప్రజాప్రతినిధిగా పనిచేయడానికి, గత ఎన్నికల్లో పోటీచేయడానికి అవకాశం రాని మహిళానేతకు అవకాశం కల్పించాలని నిర్దేశిం చింది. అయితే విధేయత, అంకిత భావం కలి గి, పార్టీ పటిష్టానికి ఉపయోగపడగలరనుకుం టే గతంలో ప్రజాప్రతినిధులుగా పనిచేసినా జాబితాలో చోటు కల్పించవచ్చని పేర్కొంది.
 
 దీంతో అధిష్టానం సూచనలకు అనుగుణంగా జాబితా రూపకల్పనలో పీసీసీ నిమగ్నమైంది. మాజీమంత్రి వి.సునీతాలక్ష్మారెడ్డి, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆకుల లలిత, కరీంనగర్ జిల్లాకు చెందిన నేరెళ్ల శారద వంటివారికి ఇప్పటికే జాబితాలో చోటు దక్కినట్టుగా తెలుస్తోంది. మరో ఐదుగురు నేతల పేర్లకోసంపీసీసీ ఇంకా కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం పదవీ కాలం ముగుస్తున్న డి.శ్రీనివాస్ కూడా ఎమ్మెల్సీ స్థానాన్ని మరోసారి ఆశిస్తున్నారు. పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ, మాజీ స్పీకర్ కె.ఆర్.సురేశ్‌రెడ్డి వంటివారు కూడా పోటీపడుతున్నారు. అధిష్టానం మాత్రం మహిళానేతకే అవకాశం కల్పించాలన్న నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది.  
 
 జాతీయ స్థాయి పదవుల్లోకి ముఖ్యులు
 రాష్ట్రం నుంచి పార్టీ జాతీయ స్థాయి పదవుల్లో కొందరికి చోటు దక్కే అవకాశముందని తెలుస్తోంది. కేంద్ర మాజీమంత్రి ఎస్.జైపాల్‌రెడ్డి, పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌లలో ఒకరికి సీడబ్ల్యూసీలో చోటు దక్కనుందని సమాచారం. అలాగే ఏఐసీసీలో పొన్నాల లక్ష్మయ్యకు అవకాశం దక్కనుందని తెలుస్తోంది.
 

మరిన్ని వార్తలు