స్టార్‌ ఓటర్స్‌

26 Nov, 2018 12:26 IST|Sakshi

డిసెంబర్‌ 7 ఓట్ల వేళ.. సినీ తారల కళ

ప్రముఖ నటులకు నగరంలోనే ఓటు

పోలింగ్‌ కేంద్రాలకు రానున్న నట దిగ్గజాలు

బంజారాహిల్స్‌ : జూనియర్‌ ఎన్టీఆర్‌.. రామ్‌చరణ్‌తేజ్‌.. దగ్గుబాటి రానా.. మహేశ్‌బాబు.. అల్లు అర్జున్‌.. సమంత అక్కినేని.. వీరే కాకుండా నాటి, నేటి వర్ధమాన సినీ తారలు, దర్శకులు, గాయకులు, సంగీత దర్శకులు, నిర్మాతలు.. ఇలా తెలుగు చలన చిత్ర పరిశ్రమకు చెందినవారంతా నగరంలోనే ఓటుహక్కు కలిగి ఉన్నారు. వీరంతా డిసెంబర్‌ 7న జరిగేతెలంగాణ శాసనసభా ఎన్నికల్లో ఓటు వేయనున్నారు. ఈసారి ఎన్నికల్లో ప్రత్యేక విశేషమేమంటే హీరోయిన్‌ సమంత అక్కినేని ఇక్కడే ఓటు హక్కు కలిగి ఉండటం. వీరిలో ఎంతమంది ఓటు వేస్తారో తెలియకపోయినా కొందరైనా పోలింగ్‌లో పాల్గొనే అవకాశముంది. సినీ దిగ్గజాలంతా తమ ఓటుహక్కును వినియోగించుకునేందుకు రానుండటంతో పోలింగ్‌ కేంద్రాలు కళసంతరించుకోనున్నాయనేచెప్పవచ్చు.  

జూబ్లీహిల్స్‌లోనివసించేవారంతా..  
నట దిగ్గజాలు, దర్శకులు, నిర్మాతలు, సంగీత దర్శకులు, నేపథ్య గాయనీ గాయకులు ఇలా ఎంతో మంది నగరంలోనే ఓటుహక్కు కలిగి ఉన్నారు. ముఖ్యంగా జూబ్లీహిల్స్‌లో నివసించే జూనియర్‌ ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ తేజ్, దగ్గుబాటి రానా, వెంకటేశ్, నాగార్జున, అక్కినేని అమల, అఖిల్, నాగచైతన్య, చిరంజీవి, నాగబాబు, మహేశ్‌బాబు, అల్లరి నరేశ్, ఆర్యన్‌ రాజేష్, కోట శ్రీనివాసరావు, కైకాల సత్యనారాయణ, శివాజీరాజా, నరేష్‌ తదితరులు ఇక్కడ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు.  

నమ్రతా శిరోద్కర్‌..ఉపాసన కూడా..
మహేశ్‌బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్, రామ్‌చరణ్‌ సతీమణి ఉపాసన కూడా ఓటు హక్కు కలిగి ఉన్నారు. ఇక జీవితా రాజశేఖర్‌ ప్రతి ఎన్నికల్లోనూ క్రమం తప్పకుండా ఓటుహక్కు వినియోగించుకుంటున్నారు. ఈసారి వారి కూతుళ్లకు కూడా ఓటుహక్కు రావడం విశేషం. మరోవైపు ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం కూడా ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. ఇక సాయిధరమ్‌తేజ్, వరుణ్‌తేజ్, తరుణ్‌ తదితరులు కూడా ఇక్కడే ఓటు వేయనున్నారు. నాగార్జున దంపతులు ప్రతి ఎన్నికల్లోనూ తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించుకోవడం ఆనవాయితీగా వస్తోంది.  

సూపర్‌స్టార్‌ కృష్ణ..విజయనిర్మల.
ఇక అలనాటి నట దిగ్గజం సూపర్‌ స్టార్‌ కృష్ణ ఆయన సతీమణి విజయ నిర్మల, మంచు మోహన్‌బాబు, మంచు విష్ణు, మంచు మనోజ్, మంచు లక్ష్మీ, పూరీ జగన్నాథ్, శ్రీనువైట్ల, రమ్యకృష్ణ, కృష్ణవంశీ, దర్శకుడు మారుతీ, అర్జున్‌రెడ్డి హీరో విజయ్‌దేవరకొండ కూడా ఓటు వేయనున్నారు. పోసాని కృష్ణముర ళి, సునీల్‌ తదితరులు కూడా ఈసారి ఓటువేయనున్నారు. జూబ్లీహిల్స్‌లో నివసించే ప్రభాస్‌తో పాటు కృష్ణంరాజు దంపతులు కూడా ఓటుహక్కు కలిగి ఉన్నారు. పరుచూరి వెంకటేశ్వరరావు, పరుచూరి గోపాలకృష్ణతో పాటు దర్శకుడు కోడి రామకృష్ణ, నటి రాశి, దర్శకుడు రాజమౌళి, విజయేంద్రప్రసాద్, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు తదితరులు కూడా ఓటుహక్కు కలిగి ఉన్నారు. ప్రముఖ దర్శకుడు డాక్టర్‌ కె.విశ్వనాథ్‌ కూడా తన ఓటుహక్కు వినియోగించుకునే అవకాశం ఉంది. అలనాటి తారలు రమాప్రభ, అన్నపూర్ణమ్మ కూడా ప్రతిసారీ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.

రామ్‌చరణ్‌ ఎంత బిజీగా ఉన్నా..
రామ్‌చరణ్‌తేజ్‌ కూడా ఎన్ని పనులున్నా ఓటు వేసిన తర్వాతనే మిగతా పనులు చూసుకుంటారు. మరోవైపు అల్లు అర్జున్, అల్లు శిరీష్‌తో పాటు నిర్మాత అల్లు అరవింద్, సుమంత్, సుశాంత్‌ కూడా తమ ఇంటి సమీపంలోనే ఏర్పాటు చేసే పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేస్తుంటారు. ప్రముఖ దర్శకులు దశరథ్‌తో పాటు మాటల రచయిత గోపీమోహన్, దర్శకులు దంతులూరి చైతన్య, సాయికిశోర్, నటుడు తనికెళ్ల భరణి కూడా ఇక్కడే ఓటు హక్కు కలిగి ఉండటంతో వారు కూడా ఓటు వేయనున్నారు. తాను మణికొండలో తప్పనిసరిగా ఓటువేస్తానని దర్శకుడు దశరథ్‌ తెలిపారు. 

మరిన్ని వార్తలు