జానారెడ్డి ఓటమి ఖాయం

20 Nov, 2018 12:31 IST|Sakshi
గుర్రంపోడు : మాట్లాడుతున్న ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌ , త్రిపురారం : మాట్లాడుతున్న బడుగుల లింగయ్యయాదవ్‌

రాజ్యసభ సభ్యుడు బడుగుల  

సాక్షి, త్రిపురారం : నాగార్జునసాగర్‌ నియోజకవర్గంలో కుందూరు జానారెడ్డిని ఓటమి ఖాయమని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్‌ అన్నారు. సోమవారం హాలియాలోని టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నోముల నర్సింహయ్య నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌ దొంగలు మళ్లీ చంద్రబాబును తీసుకొని తెలంగాణ రాష్ట్రంపై దండయాత్రకు వచ్చారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డుకునేందుకు వందకుపైగా కేసులు వేశారని విమర్శించారు. గోదావరి, కృష్ణా జలాలను మనకు రాకుండా అడ్డుకున్న ఆంధ్ర పాలకుతో దోస్తీకట్టి మరోమారు మనకు అన్యాయం చేయాలని చూస్తున్నారన్నారు. జిల్లాలో మొట్ట మొదటగా ఓడిపోయేది జానారెడ్డి, ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, దామోదర్‌రెడ్డేనన్నారు. కేసీఆర్‌ ప్రవేశపెట్టిన పలు అభివృద్ధి సంక్షేమ పథకాల వల్ల జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్‌ పార్టీకి ప్రజల నుంచి విపరీతమైన స్పందన ఉందన్నారు. గడిచిన నాలుగున్నరేళ్ల కాలంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు పొందిన ప్రజలు మళ్లి టీఆర్‌ఎస్‌ పార్టీని గెలి పించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నోముల నర్సింహయ్య, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు గడ్డంపల్లి రవీందర్‌రెడ్డి, మలిగిరెడ్డి లింగారెడ్డి, మండల అధ్యక్షుడు వెంకటేశ్వర్లు ఉన్నారు.  
విజయమే లక్ష్యంగా ముందుకెళ్లాలి
గుర్రంపోడు : బూత్‌ కమిటీలు ప్రతి ఓటరును కలిసి టీఆర్‌ఎస్‌ సంక్షేమ పథకాలను వివరించి విజయమే లక్ష్యంగా ముందుకుసాగాలని ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌ అన్నారు. మండలకేంద్రంలో జరిగిన టీఆర్‌ఎస్‌ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ పథకాలను గడపగడపకు ప్రచారం చేసేలా ప్రతి కార్యకర్త లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలని అన్నారు. నాలుగు దశాబ్దాలుగా పదవులు అçనుభవించిన జానారెడ్డి ఈ ప్రాంత అభివృద్ధికి చేసిందేమీ లేదని అన్నారు. సమావేశంలో మాజీ ఆప్కాబ్‌ చైర్మెన్‌ యడవల్లి విజయేందర్‌రెడ్డి, ఆర్‌ఎస్‌ఎస్‌ జిల్లా కన్వీనర్‌ ఇస్లావత్‌ రాంచందర్‌ నాయక్, జెడ్పీటీసీ గాలి రవికుమార్, కంచర్ల విజేందర్‌రెడ్డి పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు