పోలింగ్‌ నివేదికలను సకాలంలో అందజేయాలి

6 Dec, 2018 09:40 IST|Sakshi
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్, పాల్గొన్న ఆర్‌ఓలు, అధికారులు  

సాక్షి, హన్మకొండ అర్బన్‌: చట్టబద్ధమైన నివేదికలు సకాలంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు పంపించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ప్రశాంత్‌జీవన్‌పాటిల్‌ ఆదేవించారు. కలెక్టరేట్‌లో ఎన్నికల సంబంధిత అధికారులతో బుధవారం ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పాటిల్‌ మాట్లాడుతూ నివేదికలు రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంపేముందు తన దృష్టికి తీసుకురావాలన్నారు. ఆర్‌ఓలు వ్యక్తిగతంగా పరిశీలించి, ధ్రువీకరించకున్న తర్వాతనే నివేదికలు పంపించాలన్నారు. ప్రతి అంశాన్ని ఎన్నికల కమిషన్‌ నిశితంగా పరిశీలిస్తుందని తెలిపారు. 

కమిషన్‌కు పంపిన ప్రతి నివేదిక వారికి అందినట్లు ధ్రువీకరించుకోవాలన్నారు. పోలింగ్‌ రోజు మధ్యాహ్నం ఒంటి గంటకు, సాయంత్రం 7 గంటలకు, మరుసటి రోజు ఉదయం 7 గంటలకు నివేదికలు పంపాలని సూచించారు. పోలింగ్‌ కేంద్రాల దారిలో రెండు వైపులా 100మీటర్ల దూరంలో లైన్లు మార్కింగ్‌ చేయాలన్నారు. బూత్‌లెవల్‌ అధికారులతో ఓటరు సహాయ కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. మాక్‌ పోలింగ్‌కు ముందు వీవీ ప్యాట్లు ముట్టుకోవద్దన్నారు. పోలింగ్‌ పార్టీలు, వెబ్‌కాస్టింగ్‌ విద్యార్థులు, మైక్రో అబ్జర్వర్లకు, ఎన్‌ఎస్‌ఎస్‌ వలంటీర్లకు నిబంధనల ప్రకారం రెమ్యూనరేషన్‌ చెల్లించేందుకు నిధులు ముందుగా డ్రా చేసుకోవాలని అధికారులకు సూచించారు. నిఘా బృందాలకు కౌంటింగ్‌ అనంతరం చెల్లింపులు చేయనున్నట్లు తెలిపారు. వెబ్‌కాస్టింగ్‌ విద్యార్థులు, ఎన్‌స్‌ఎస్‌ వలంటీర్లు ఓటుహక్కు కల్గి ఉన్నట్లయితే వారికి పోస్టల్‌ బ్యాలెట్లు అందజేయాలన్నారు. జేసీ దయానంద్, ఆర్‌ఓలు గౌతం, వెంకారెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

స్వేచ్ఛగా ఓటేయాలి : కలెక్టర్‌
ఈ నెల ఏడో తేదీన పోలింగ్‌ సందర్భంగా జిల్లాలోని ప్రతి ఓటరు  ఎలాంటి ప్ర లోభాలకు లోను కాకుండా స్వేచ్ఛగా తమ ఓటుహక్కును వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ కోరారు. రాష్ట్ర భవిష్యత్‌ను నిర్ధారించేందుకు పాలనా వ్యవస్థ ను ఎంపిక చేసుకునే అవకాశం ప్రతి పౌరుడికి ఉం టుందని..అందరూ వినియోగించుకోవాలని సూ చించారు. పోటీలో ఉన్నవారిలో నచ్చినవారికి ఓటువేయొచ్చని.. లేదంటే నోటాకు వేటు వేయొచ్చని పేర్కొన్నారు.  

>
మరిన్ని వార్తలు