ఏపీ సీఎం జగన్ను ఆదర్శంగా తీసుకోవాలి 

16 Feb, 2020 02:40 IST|Sakshi

బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య

పంజగుట్ట: దేశంలోని అందరు ముఖ్యమంత్రులు ఆంధ్రప్రదేశ్‌ సీఎం వైఎస్‌ జగన్మోహన్ రెడ్డిని ఆదర్శంగా తీసుకోవాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య సూచించారు. బీసీ ముఖ్యమంత్రులు ఉన్న రాష్ట్రాల్లో కూడా బీసీల కోసం అమలుచేయని సంక్షేమ పథకాలను ఆంధ్రప్రదేశ్‌లో చేస్తున్నారని కొని యాడారు. ఏపీలో గత బడ్జెట్‌లో బీసీల కోసం రూ.18 వేల కోట్లు కేటాయించారని, తెలంగాణలో రూ.3 వేల కోట్లు మాత్రమే ఇచ్చారని తెలిపారు. ప్రస్తుత బడ్జెట్‌లో అయినా తెలంగాణలో బీసీల కోసం రూ.10 వేల కోట్లు కేటా యించాలని డిమాండ్‌ చేశారు.

ఈ మేరకు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ను శనివారం ఖైరతాబాద్‌లోని ఆయన కార్యాలయంలో కలిసి వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ.. ఏపీలో నామినేటెడ్‌ పోస్టుల్లో బీసీలకు 50%, బీసీ విద్యార్థులకు పూర్తి స్థాయిలో ఫీజు రీయింబర్స్‌మెంట్, చట్టç సభల్లో బీసీలకు రిజర్వేషన్లు కేటాయించాలని పార్లమెంట్‌ లో ప్రైవేట్‌ బిల్లు ప్రవేశపెట్టడం లాంటి ఎన్నో పనులు జగ¯Œ  చేశారని గుర్తుచేశారు. మంత్రిని కలిసిన వారిలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ, నాయకులు ఎర్ర సత్యనారాయణ, మహేశ్‌ యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు