రైతన్న కన్నెర్ర

8 Oct, 2014 03:33 IST|Sakshi
రైతన్న కన్నెర్ర

బొంరాస్‌పేట: గింజగట్టిపడే దశలో నీళ్లందక పంటలు ఎండిపోవడం చూసి అన్నదాతలు ఆవేదన చెందారు. కరెంట్ కోతలను నిరసిస్తూ రైతులు రోడ్డెక్కారు. ప్రభుత్వ ఉదాసీనవైఖరిపై మండి పడ్డారు. విద్యుత్ కోతల కారణంగా పంటలు ఎండిపోవడంతో ఆందోళనకు గురైన అన్నదాతలు మంగళవారం మండలంలోని నాగిరెడ్డిపల్లిలో హైదరాబాద్- బీజాపూర్ అం తర్రాష్ట్ర రహదారిపై రాస్తారోకో చేశారు. సరఫరాలో వేళలు పాటించి కనీసం రోజుకు ఆరుగంటల కరెంట్‌ల పాటు సరఫరా చేయాలని డి మాండ్‌చేశారు. గంటపాటు జరిగిన ఆందోళన లో తమగోడును వినిపించారు.

మండలంలోని కొత్తూరు, బడిచర్ల, మహంతీపూర్, నాగిరెడ్డిపల్లి, ఏనెమీదితండా, కట్టుకాల్వతండా, ఊరెనికితండా, రాంనాయక్‌తండాలతోపాటు మరి కొన్ని తండాలు, గ్రామాలకు విద్యుత్ సరఫరాచేసేందుకు మంజూరైన 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్  పనులు పూర్తికాకపోవడంతోనే కరెం ట్ సమస్యతలెత్తింది.కాగా,ఎస్సైశ్రీనివాస్ రైతు లను సముదాయించి ట్రాఫిక్ అంతరాయాన్ని తొలగించారు.

అనంతరం రైతులు మం డల తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. సమస్యను తీర్చేందుకు ఉపతహశీల్దార్ కిష్ట్యానాయక్, ట్రాన్స్‌కో ఏఈ హరినాథాచారి భరోసాఇచ్చారు. ‘కొత్తూరు శివారులో నూతనంగా నిర్మిస్తున్న విద్యుత్ సబ్‌స్టేషన్ పనులు లైన్ ఏర్పాటుదశకు వచ్చాయి. మరో నెలరోజుల్లో పనులు పూర్తవుతాయి.  ఆ తరువాత 22 గ్రామాలకు కరెంట్‌సమస్య తీరుతుంది..’అని ట్రాన్స్‌కో ఏఈ హరినాథచారి తెలిపారు.

whatsapp channel

మరిన్ని వార్తలు