టెలిఫోన్ దుర్వినియోగం వాస్తవమే

22 Jan, 2015 06:29 IST|Sakshi

గవర్నర్ ప్రెస్ సెక్రటరీ వివరణ
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని గవర్నర్ అధికారిక కార్యాలయం టెలిఫోన్ దుర్వినియోగంపై రాజ్‌భవన్ వర్గాలు స్పందించాయి. ‘రాజ్‌భవన్ టెలిఫోన్ దుర్వినియోగం’ శీర్షికన బుధవారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై గవర్నర్ ప్రెస్ సెక్రటరీ వివరణ ఇచ్చారు. ఈ విషయం వాస్తవమే అని పరోక్షంగా అంగీకరించిన ఆయన దీన్ని ఒక రోజులోనే బీఎస్‌ఎన్‌ఎల్ అధికారులు గుర్తించారని పేర్కొన్నారు. దీని వల్ల రూ. 38,233 అదనపు బిల్లు వచ్చినట్లు నిర్ధారించామని వివరించారు.
 
ఈ నష్టాన్ని సంబంధిత వ్యక్తుల నుంచి రికవరీ చేస్తామని తెలిపారు. ఈ వ్యవహారంపై రాజ్‌భవన్ వర్గాలు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాయని,  త్వరలోనే అధికారులు నివేదిక సమర్పిస్తారని వివరించారు. అదనపు ఈపీఏబీఎక్స్ వ్యవస్థ ఏర్పాటు, ప్రస్తుతం ఉన్న దానితో అనుసంధానం పనులను గేట్‌వే బిజినెస్ సొల్యూషన్స్ సంస్థ చేపడుతోందని పేర్కొన్నారు. ఈ వ్యవస్థల్ని ఇంకా రాజ్‌భవన్ వర్గాలకు స్వాధీనం చేయలేదని, దుర్వినియోగాన్ని గుర్తించిన వెంటనే అవసరమైన రక్షణ చర్యలు తీసుకుంటున్నట్లు ప్రెస్ సెక్రటరీ తెలిపారు.

మరిన్ని వార్తలు