-

దారుణం

5 Nov, 2015 01:35 IST|Sakshi
దారుణం

మాజీ ఎంపీ రాజయ్య ఇంట్లో ఘోర ప్రమాదం
కోడలు సారిక సహా ముగ్గురు మనువళ్ల సజీవ దహనం
గ్యాస్ లీక్ కావడంతో ఘటన
హత్యా.. ఆత్మహత్యా... అని అనుమానాలు
హత్య చేశారని సారిక తల్లి ఆరోపణ
పోలీసుల అదుపులో ‘సిరిసిల్ల’ కుటుంబం
ఉప ఎన్నిక నేపథ్యంలో   రాష్ర్టంలో సంచలనం  

 
మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య ఇంట్లో బుధవారం తెల్లవారుజామున జరిగిన ఘోర ప్రమాదం అందరినీ    దిగ్భ్రాంతికి గురి చేసింది. రాజయ్య కోడలు సారిక, మనవళ్లు అభినవ్(7), అయోన్(5), శ్రీయోన్(5) మంగళవారం రాత్రి పడుకున్న వారు పడుకున్నట్లుగానే మంటల్లో కాలిపోయారు. గ్యాస్ లీక్ కావడంతో ప్రమాదం జరిగిందని రాజయ్య కుటుంబీకులు చెబుతుండగా.. కొంతకాలంగా జరుగుతున్న గొడవల్లో భాగంగానే తమ కుమార్తెను అత్తింటివారే హత్య చేశారని సారిక కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఏదిఏమైనా.. అభం శుభం తెలియని చిన్నారులు మంటల్లో మాడిపోవడం ప్రతిఒక్కరినీ కలిచివేసింది.   
 
వరంగల్ క్రైం : మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య కోడలు సారిక, ముగ్గురు కుమారుల సజీవ దహనంపై శాస్త్రీయ పద్ధతిలో విచారణ చేపడుతున్నట్లు వరంగల్ నగర పోలీసు కమిషనర్ సుధీర్‌బాబు తెలిపారు. సంఘటనా ప్రదేశం వద్ద ఆయన విలేకరులతో మాట్లాడుతూ హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా ఫోరెన్సిక్ టీమ్‌ను రప్పిస్తున్నామని పూర్తి స్థారుులో విచారణ చేపట్టిన తర్వాత చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే, పోస్ట్‌మార్టం నివేదిక వచ్చిన తర్వాత నిజాలు వెలుగుచూస్తాయని పేర్కొన్నారు.
 
విచారణకు ప్రత్యేక టీమ్...
 సజీవదహనం కేసును చేధించేందుకు ప్రత్యేకం గా పోలీసు బృందాన్ని ఏర్పాటు చేసినట్లు సీపీ సుధీర్‌బాబు తెలిపారు. ఏసీపీ నేతృత్వంలో నియమించనున్న ఈ బృందంలో ముగ్గురు సీఐ లు విచారణ అధికారులుగా ఉంటారన్నారు.
 
పలుమార్లు ఘటనా ప్రదేశానికి సీపీ
 ఇదిలా ఉండగా ఘటన జరిగిన రాజయ్య ఇం టికి ఉదయమే చేరుకున్న సీపీ సుధీర్‌బాబు అ క్కడే ఉండి భద్రత ఏర్పాట్లను పర్యవేక్షించారు. అలాగే, ఘటన జరిగిన గదిని ప్రత్యేకంగా పరి శీలించిన సీపీ ఆ తర్వాత కూడా పలుమార్లు సం ఘటన ప్రదేశానికి వెళ్లడం గమనార్హం. అక్కడి ఆనవాళ్లను క్షుణ్ణంగా పరిశీలించారు.
 
 
పోచమ్మమైదాన్ : మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య ఇంట్లో ఆయన కోడలు, మనుమలు మృతి చెందిన విషయం బుధవారం తెల్లవారుజామున వెలుగులోకి రావడంతో అధికారులు పరిశీలించారు. ఘటనకు సంబంధించి ఎన్నికల కమిషన్ నుంచి నివేదిక అడిగే అవకాశముండడంతో అధికారులు రెవెన్యూ కాలనీలోని రాజయ్య ఇంటికి చేరుకుని ప్రమాద తీరును పరిశీలించారు. అధికారులు పరిశీలించి వెళ్తున్న క్రమంలో మరణానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని స్థానిక మహిళలు అడ్డుకున్నారు. ఘటనా స్థలానికి వచ్చిన కలెక్టర్ కరుణ.. పోలీసు కమిషనర్ సుధీర్‌బాబుతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఆ తర్వాత ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఐజీ నవీన్ చంద్.. మీడియాతో మాట్లాడుతూ సారిక పడక గదిలో గ్యాస్ సిలిండర్ లభ్యమైందని తెలిపారు.

తెల్లవారుజామున 4గంటలకు ఘటన జరిగిందని, ఈ ఘటనతో సంబంధం ఉన్న వాళ్ల పై చర్యలు తప్పవని స్పష్టం చేశారు. సారిక అమ్మ, చిన్నమ్మ ఘటనాస్థలికి వచ్చారని.. పోస్ట్‌మార్టం అనంతరం సారిక, అభినవ్, అయోన్, శ్రీయోన్ మృతదేహాలను వారి కుటుంబీకులకు అప్పగిస్తామని తెలిపారు. ఫోరెన్సిక్ నిపుణులు ఘటనాస్థలిని పరిశీలిస్తున్నారని, కేసు ఇంకా దర్యాప్తు దశలో ఉందని వెల్లడించారు. ఇక వరంగల్ సీపీ సుధీర్‌బాబు ఉదయం నుంచి మృతదేహాలను తరలించే వరకు అక్కడే ఉన్నారు. ఇంకా డీఐజీ మల్లారెడ్డి, రూరల్ ఎస్పీ అంబర్ కిశోర్ ఝ, వరంగల్ ఆర్‌డీఓ వెంకట మాధవరావు, వరంగల్ తహసీల్దార్ గుజ్జుల రవీందర్ ఉన్నారు.
 

మరిన్ని వార్తలు