‘మెదక్‌’లో ఒక్కడు

13 Nov, 2018 10:52 IST|Sakshi
నామినేషన్‌ పత్రాలు అందజేస్తున్న మెదక్‌ బీఎల్‌ఎఫ్‌ అభ్యర్థి దూడ యాదేశ్వర్‌

మొదటి రోజు ఒకే ఒక్క నామినేషన్‌ దాఖలు

ముహూర్తాలు చూసుకుంటున్న అభ్యర్థులు

నామినేషన్‌ దాఖలు చేసిన బీఎల్‌ఎఫ్‌ అభ్యర్థి దూడ యాదేశ్వర్‌

14న నామినేషన్‌ వేయనున్న    టీఆర్‌ఎస్‌ 

సాక్షి, మెదక్‌: అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్‌ సోమవారం విడుదలైంది. విడుదలైన వెంటనే మెదక్, నర్సాపూర్‌ నియోజకవర్గాల్లో ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభించారు. మొదటి రోజు జిల్లాలో ఒకే ఒక్క నామినేషన్‌ దాఖలయింది. మెదక్‌ అసెంబ్లీ నియోకజవర్గంనుంచి పోటీకి బీఎల్‌ఎఫ్‌ అభ్యర్థి  దూడ యాదేశ్వర్‌ నామినేషన్‌ వేశారు. నర్సాపూర్‌ నియోజకవర్గంలో మొదటి రోజు ఎలాంటినామినేషన్లు దాఖలు కాలేదు.

 యాదేశ్వర్‌ మెదక్‌ పట్టణంలోని బీఎల్‌ఎఫ్‌ కార్యాలయం నుంచి ర్యాలీగా రిటర్నింగ్‌ ఆఫీసర్‌ కార్యాలయానికి వచ్చారు. రిటర్నింగ్‌ ఆఫీసర్‌ వీరబ్రహ్మచారికి నామినేషన్‌ పత్రాలనుఅందజేశారు. ఆయన వెంట బీఎల్‌ఎఫ్‌ నాయకులు చుక్క రాములు తదితరులు ఉన్నారు. అయితే నామినేషన్లు వేసేందుకు ఎమ్మెల్యే అభ్యర్థులు మంచి ముహుర్తాలు వెతుక్కుంటున్నారు. సిద్ధాంతులనుసంప్రదించి తమ జాతకాలకు అనుగుణంగా మంచి రోజులను తెలుసుకుంటున్నారు.

నామినేషన్లు వేసేందుకు ఈనెల 14, 18, 19 తేదీల్లో అనుకులంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయా తేదీల్లోనామినేషన్లు వేసేందుకు అభ్యర్థులు సిద్ధం అవుతున్నారు. టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఈనెల 14న గజ్వేల్‌లో నామినేషన్‌ వేయనున్నారు.  14న పద్మాదేవేందర్‌రెడ్డి  తరఫున నాయకులు నామినేషన్‌ వేయనున్నారు. 19న పద్మాదేవేందర్‌రెడ్డి నామినేషన్‌ దాఖలు చేసేందుకు సిద్ధం అవుతున్నారు. నర్సాపూర్‌ ఎమ్మెల్యే అభ్యర్థి మదన్‌రెడ్డి సైతం 14, 19 తేదీల్లో నామినేషన్లు వేయనున్నట్లు తెలుస్తోంది.  

మరిన్ని వార్తలు