సూర్యాపేటలో 30 పోలీస్‌ యాక్ట్‌

24 Sep, 2019 15:06 IST|Sakshi

సాక్షి, సూర్యాపేట : హుజుర్‌నగర్‌ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఉప ఎన్నిక జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్‌ యాక్ట్‌ అమలు చేస్తున్నట్లు ఎస్పీ ఆర్‌ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశామని, అక్టోబర్‌ 24వతేదీ వరకు 30 పోలీస్‌ యాక్ట్‌ అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు. ఈ సందర్బంగా అధికారుల అనుమతి లేకుండా ఎటువంటి ధర్నాలు, రాస్తారొకో, సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించడానికి వీలులేదన్నారు. ఒకవేళ ఎవరైనా నిబంధనలను ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని ఎస్పీ హెచ్చరించారు. ప్రజలకు రక్షణ, శాంతి భద్రతలకు ఎలాంటి భంగం కలగకూడదనే ఈ యాక్ట్‌ను అమలు చేస్తున్నట్లు ఎస్పీ ఉత్తర్వుల్లో వెల్లడించారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా