సికింద్రాబాద్‌– బరౌని మధ్య ప్రత్యేక రైళ్లు

22 Sep, 2017 00:26 IST|Sakshi

హైదరాబాద్‌: దసరా, దీపావళి పండుగల సందర్భంగా ప్రయాణికుల రద్దీ దృష్ట్యా సికింద్రాబాద్‌– బరౌని, హైదరా బాద్‌– కొచువెలి మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎం.ఉమాశంకర్‌కుమార్‌ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు సికింద్రాబాద్‌– బరౌని (07009/ 07010) ప్రత్యేక రైలు ఈ నెల 24, అక్టోబర్‌ 1, 8, 15, 22, 29, నవంబర్‌ 5, 12, 19, 26 తేదీల్లో రాత్రి 10 గంటలకు సికింద్రాబాద్‌ నుంచి బయలుదేరి రెండవ రోజు ఉదయం 11.40కి బరౌని చేరుకుంటుంది.

తిరుగు ప్రయాణంలో ఈ నెల 27, అక్టోబర్‌ 4, 11, 18, 25, నవంబర్‌ 1, 8, 15, 22, 29 తేదీల్లో ఉదయం 7.10కి బరౌని నుంచి బయలుదేరి మరుసటి రోజు రాత్రి 10.40కి సికింద్రాబాద్‌ చేరుకుంటుంది. హైదరా బాద్‌– కొచువెలి (07115/07116) ప్రత్యేక రైలు అక్టోబర్‌ 7, 14, 21, 28 తేదీల్లో రాత్రి 9 గంటలకు హైదరాబాద్‌ నుంచి బయలుదేరి రెండో రోజు తెల్లవారుజామున 3.20కి కొచువెలికి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో అక్టోబర్‌ 9, 16, 23, 30 తేదీల్లో రాత్రి 8.15కి కొచువెలి నుంచి బయలుదేరి రెండవ రోజు ఉదయం 3.30కి హైదరాబాద్‌ చేరుకుంటుంది.
 

మరిన్ని వార్తలు