పల్లె సమస్యలపై గళం విప్పేనా?

3 Apr, 2019 15:08 IST|Sakshi
సూర్యాపేట మండల పరిషత్‌ కార్యాలయం 

నేడు సూర్యాపేట మండల సర్వసభ్య సమావేశం

నూతన సర్పంచ్‌లకు ఇదే తొలిసభ

సాక్షి, సూర్యాపేటరూరల్‌ : కొత్త సర్పంచ్‌లు ప్రమాణ స్వీకారం చేసేంతవరకూ ప్రత్యేకాధికారుల పాలనలో ఉన్న గ్రామాలు ఆశించిన మేర అభివృద్ధికి నోచుకోలేదు. నిధులు సరిగ్గా లేక అధికారులు స క్రమంగా విధులు నిర్వహించకపోవడంతో పంచా యతీల్లో ఎక్కడవేసిన గొంగళిఅక్కడే ఉంది. ఇప్పుడు పంచాయతీలకు కొత్త పాలకవర్గాలు రావడం, అధికారులు సక్రమంగా విధుల్లో ఉండడంతో గ్రామాలు అభివృద్ధిబాట పట్టే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 3న (బుధవారం) సూర్యాపేట మండల పరిషత్‌ సమావేశం జరుగనుంది. అయితే గ్రామాల్లో పేరుకుపోయిన సమస్యలను ప్రస్తావించడానికి సర్పంచ్‌లకు మండల సర్వసభ్య సమావేశం అసెంబ్లీ లాంటిది. బుధవారం సూర్యాపేట మండలపరిషత్‌ కార్యాలయంలో జరుగనున్న క్రమంలో తొలిసారిగా హాజరవుతున్న సర్పంచ్‌లు తమ గ్రామసమస్యలపై గళం విప్పుతారో లేదో చూడాల్సి ఉంది. 


నూతన సర్పంచ్‌లకు తొలి వేదిక
మండలంలో నూతనంగా గెలిచిన సర్పంచ్‌లకు బుధవారం జరిగే మండల సర్వసభ్య సమావేశం తొలి వేదిక కానుంది. గ్రామాల్లో ప్రజా సమస్యలకు పరిష్కార మార్గానికి మండల సర్వసభ్య స మావేశం నూతన సర్పంచ్‌లకు అనుభవంగా మా రనుంది. సూర్యాపేట మండలంలోని 23 గ్రామపంచాయతీల సర్పంచ్‌లు సర్వసభ్య సమావేశానికి హాజరై ప్రభుత్వ శాఖల ఆధీనంలో ఉన్న వివి ధశాఖలకు సంబంధించిన అంశాలను సమావేశంలో సుదీర్ఘంగా చర్చించడానికి సర్పంచ్‌లకు, ఎం పీటీసీలకు అవకాశం ఉంటుంది. బుధవారం సూ ర్యాపేట మండలపరిషత్‌ కార్యాలయ సమావేశ మందిరంలో ఉదయం 11గంటలకు సర్వస భ్య సమావేశం నిర్వహించనున్నారు. మండల పరిషత్‌ అధ్యక్షుడు వట్టె జానయ్యయాదవ్‌ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి వివిధశాఖల అధికా రులు,  మండల ప్రజాప్రతినిధులు హాజరవుతారు. 


ముగియనున్న ఎంపీటీసీల పదవీకాలం..
బుధవారం జరిగే మండల సర్వసభ్య సమావేశానికి సర్పంచ్‌లు తొలిసారి హాజరయ్యేందుకు సిద్ధమవుతున్నారు. ఇదిలాఉంటే ఎంపీటీసీ సభ్యుల పదవీకాలం మాత్రం ముగియనుంది. అయితే మే నెలలో ఎన్నికలు నిర్వహించకుంటే ఎంపీటీసీలు కూడా మరో సర్వసభ్య సమావేశానికి హాజరయ్యే అవకాశం ఉంటుంది. అయితే సర్పంచ్‌లకు ఇప్పటికే గ్రామాల్లో ఉన్న సమస్యలపై అవగాహనకు వచ్చారు. సమస్యల పరిష్కారానికి సమావేశంలో తమ గళమెత్తే దిశగా సన్నద్ధమవుతున్నారు. 

చర్చకు రానున్న ఎన్నో అంశాలు..
బుధవారం జరిగే సమావేశంలో 19అంశాలు ప్రధానంగా చర్చించుటకు మండల పరిషత్‌ అధ్యక్షుడు అనుమతితో సర్వసభ్య సమావేశం నిర్వహిస్తారు. ఇందులో వ్యవసాయం, ఉద్యాన, హరితహారం, మిషన్‌ భగీరథ, పంచాయతీరాజ్, పౌరసరఫరాలశాఖ, గ్రామీణ విద్యుత్, వైద్యఆరోగ్యం, ప్రాథమిక విద్య, ఉపాధిహామీ పథకం, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, ఐటీడీఏ, స్త్రీ, శిశుసంక్షేమశాఖ, రవాణాశాఖ, అటవీశాఖ, పశుపోషణ, మిషన్‌కాకతీయ, వసతి గృహాలు, రోడ్డు భవనాలు వంటి శాఖలకు సంబంధించిన వివిధ సమస్యలు సభలో చర్చకు వస్తాయి.

అయితే వ్యవసాయ అధికారులు రైతులకు సాగులో సూచనలు ఇస్తున్నారా లేదా..అదేవిధంగా యాంత్రీకరణపై అవగాహన కల్పిస్తున్నారా లేదా అనే విషయాల తో పాటు అనేక విషయాలు చర్చకు రావాల్సి ఉంది. ఉపాధిహామీ పథకం ద్వారా కూలీలకు పని కల్పిస్తున్నారా..కూలీలు ఉపాధి సద్వినియోగం చేసుకుంటున్నారా అనే అంశం చర్చకు రావాల్సి ఉంది. గతేడాది గ్రామాల్లో చేసిన ఉపాధి పనులు సరిగ్గా ఉన్నాయో లేదో చూడాల్సిన అవసరం ఉంది. రైతులకు ఉపయోగపడే పనులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

పశుపోషణ ద్వారా పాడిగెదేలు, గొర్రెల పెంపకం తదితర కార్యక్రమాలతో పాటు వివిధ శాఖలైనా ప్రాథమిక వైద్యం పనితీరు, వైద్యసేవలు, ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం అమలు, పాఠశాలలో విద్యాబోధన, అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులు, బాలింతలు, గర్భిణులకు సరిగ్గా పోషకాహారం పంపిణీ చేస్తున్నారా..రేషన్‌ పంపిణీ గ్రామాల్లో సక్రమంగా అవుతుం దా..అనే అంశాలపై నూతన సర్పంచ్‌లకు సమావేశంలో చర్చించే అవకాశం ఉంటుంది. ఈ సమావేశంలో తమ గ్రామపరిధిలో ఉన్న సమస్యలపై  అధికారులతో చర్చిస్తేనే సమస్యలు పరిష్కారానికి నోచుకునే అవకాశం ఉంది. ఈ సర్వసభ్య సమావేశానికి సర్పంచ్‌లు తొలిసారిగా హాజరవుతున్నారు. సమస్యలపై చర్చించి సమావేశాన్ని సద్వినియోగం చేసుకుంటారో.. లేదో వేచి చూడాల్సి ఉంది.

మరిన్ని వార్తలు