జన్మదినం నాడే నామినేషన్‌ వేయబోతున్నా!

3 Apr, 2019 15:10 IST|Sakshi

సాక్షి, లక్నో: ఇటీవల పార్టీలో చేరిన మాజీ ఎంపీ, సినీతార జయప్రదను ఉత్తరప్రదేశ్‌లోని రామ్‌పూర్‌ నుంచి దింపాలని బీజేపీ అధిష్టానం నిర్ణయించింది. దీంతో ఎస్పీ నేత ఆజం ఖాన్‌పై ఆమె పోటీకి సిద్ధమవుతున్నారు. ‘ఇది నాకెంతో సంతోషకరమైన విషయం. ఈ  రోజు జన్మదినం సందర్భంగా నామినేషన్‌ వేయబోతున్నాను. నాకు మద్దతు తెలిపిన ప్రధాని మోదీతోపాటు అభిమానులు, ప్రజలందరికీ కృతజ్ఞతల’ని జయప్రద సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. 

తన రాజకీయ జీవితాన్ని టీడీపీతో ప్రారంభించిన జయప్రద తర్వాత చంద్రబాబుతో విభేదాలు రావడంతో, ఆ పార్టీని వదిలి సమాజ్‌వాదీ పార్టీలో చేరారు. ఎస్పీ అభ్యర్థిగా రామ్‌పూర్‌ నుంచి 2004-2009 మధ్య కాలంలో జయప్రద ఎంపీగా సేవలందించారు. 2010లో మరో ఎస్పీ నాయకుడు అమర్‌సింగ్‌తోపాటు జయప్రదను ఎస్పీ బహిష్కరించింది. 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు