తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల

28 May, 2015 15:27 IST|Sakshi
తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల

హైదరాబాద్ : తెలంగాణలో ఎంసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి గురువారం హైదరాబాద్ జేఎన్‌టీయూ ఆడిటోరియంలో ఉదయం 11.30 గంటలకు తెలంగాణ ఎంసెట్ ర్యాంకులను విడుదల చేశారు. 85.98 శాతం  మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. మెడిసిన్ లో 85.98, ఇంజినీరింగ్ లో  70.65 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

ఈ నెల 14న జరిగిన ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ మెడిసిన్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. విద్యార్థులు ఇంటర్మీడియెట్‌లో సాధించిన మార్కులకు 25 శాతం వెయిటేజీ కలిపి ఈ ర్యాంకులను విడుదల చేశారు. ఇంజనీరింగ్ కూ 1,28,174 మంది, అగ్రికల్చర్ అండ్ మెడిసిన్‌కు 84,678 మంది పరీక్ష రాశారు. ప్రస్తుతం ఇంటర్ వార్షిక పరీక్షల్లో విద్యార్థులు సాధించిన మార్కులకు వెయిటేజీ కలిపి ర్యాంకులను ఇవ్వగా, అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు వేరుగా ర్యాంకులను ఇస్తారు.  విద్యార్థుల ర్యాంకులతోపాటు ఎంసెట్‌లో సాధించిన మార్కులను కూడా విడుదల చేశారు.

 

మరిన్ని వార్తలు