టీచర్‌ పోస్టులు 10,000 పైనే!

16 Oct, 2017 08:49 IST|Sakshi

కొత్త జిల్లాల వారీగా

ఖాళీలపై లెక్కలేసిన డీఈవోలు

8,792 రెగ్యులర్‌ పోస్టులు.. మిగతావి బ్యాక్‌లాగ్‌

వచ్చే ఏడాదినాటికి మరిన్ని ఖాళీలు

విద్యాశాఖకు వివరాల అందజేత?

సాక్షి, హైదరాబాద్‌: కొత్త జిల్లాల వారీగా భర్తీ చేయనున్న టీచర్‌ పోస్టులు దాదాపు ఖరారయ్యాయి. డీఈవోలు 31 జిల్లాల వారీగా పోస్టుల లెక్కల్ని తేల్చారు. బ్యాక్‌లాగ్‌ పోస్టులు కలుపుకొని మొత్తం 10 వేలకు పైగా ఖాళీలు ఉన్నట్లు తెలిసింది. ఇందులో 8,792 రెగ్యులర్‌ పోస్టులను భర్తీ చేయనుండగా, మిగతావి బ్యాక్‌లాగ్‌ పోస్టులని అధికారులు చెబుతున్నారు. డీఈవోలు తాజాగా విద్యాశాఖకు ఈ వివరాలను అందజేసినట్లు సమాచారం. వచ్చే ఏడాది వరకు రిటైర్మెంట్ల ద్వారా ఏర్పడే 2 వేలకు పైగా ఖాళీలను కూడా భర్తీ చేసే ఆలోచనలో విద్యాశాఖ ఉన్నట్లు తెలిసింది.

అయితే వాటిని ఇప్పటికిప్పుడు భర్తీ చేసే అవకాశం కనిపించడం లేదు. అందుకు ఆర్థిక శాఖ నుంచి ఆమోదం లభించాల్సి ఉంది. టీచర్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్టు(టీఆర్‌టీ) నిర్వహించే నాటికి సప్లిమెంటరీ నోటిఫికేషన్‌ ద్వారా వాటిని భర్తీ చేసే అవకాశం ఉన్నట్టు విద్యాశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. జిల్లాల వారీగా స్కూల్‌ అసిస్టెంట్, సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ పండిట్‌ పోస్టులు కలిపి వీటిని లెక్క వేసినట్లు తెలిసింది. అయితే విద్యాశాఖ ఉన్నతాధికారులు మాత్రం ఈ పోస్టుల వివరాలపై అధికారికంగా స్పష్టత ఇవ్వడం లేదు.

జిల్లాల నుంచి సేకరించిన సమాచారం ప్రకారం పోస్టుల వివరాలివీ..
ఆదిలాబాద్‌–293, నిర్మల్‌–226, మంచిర్యాల–169, కుమరం భీమ్‌–1,018, నిజమాబాద్‌–156, కామారెడ్డి–380, జగిత్యాల–253, పెద్దపల్లి–54, కరీంనగర్‌–71, సిరిసిల్ల–108, వరంగల్‌ అర్బన్‌–143, వరంగల్‌ రూరల్‌–123, జనగామ–168, మహబూబాబాద్‌–135, జయశంకర్‌ భూపాలపల్లి–380, ఖమ్మం–57, కొత్తగూడెం–100, నల్లగొండ–408, సూర్యాపేట–300, యాదాద్రి–339, రంగారెడ్డి–600, వికారాబాద్‌– 826, మేడ్చల్‌–200, మెదక్‌–297, సిద్దిపేట–155, సంగారెడ్డి–1,105, మహబూబ్‌నగర్‌–725, నాగర్‌ కర్నూల్‌–436, గద్వాల–387, వనపర్తి–154, హైదరాబాద్‌–200  

మరిన్ని వార్తలు