‘మిషన్ కాకతీయ’ దేశానికే ఆదర్శం: హరీశ్

9 May, 2015 02:39 IST|Sakshi

హైదరాబాద్: మిషన్ కాకతీయ కార్యక్రమాన్ని జాతీయ, అంతర్జాతీయస్థాయిలో ఆసక్తిగా గమనిస్తున్నందున అత్యంత జాగ్రత్తగా పనులు చేయాలని నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు చిన్న నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. మిషన్ కాకతీయ పనులతీరు దేశానికే ఆదర్శంగా ఉండాలన్నారు. శుక్రవారం ఆయన హైదరాబాద్ జలసౌధలో అధికారులతో కలసి మిషన్ కాకతీయ పనుల పురోగతిపై సమీక్షించారు. గతంలో చిన్ననీటి పారుదలపై ఉన్న తప్పుడు భావనను తొలగించేందుకు ఇంజనీర్లు సహకరించాలని సూచించా రు. కష్టపడిన ఇంజనీర్లను కాపాడుకుంటామని, తప్పు చేసిన అధికారులను శిక్షిస్తామని స్పష్టం చేశారు.

ప్రజల విన్నపాలను చెత్తబుట్టలో వేయకుండా మానవతాదృష్టితో వాటి పరిష్కారానికి కృషి చేయాలని అధికారులను ఆదేశిం చారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస కమీషన్ ప్రకటించబోయే మొదటి బ్యాచ్ ఇం జనీర్ల నియామకంలో సాగునీటి శాఖ ఖాళీలను నింపడానికి ముఖ్యమంత్రి అనుమతించారని మంత్రి వెల్లడించారు. దీనికి సంబంధించిన దస్త్రాన్ని సిద్ధం చేయాలని ఆ శాఖ ముఖ్యకార్యదర్శిని ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న  ఖాళీ లను పదోన్నతుల ద్వారా భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. ఇదే సమయంలో, సీఎం జిల్లా పర్యటనలకు వెళ్లినప్పుడు అక్కడి ప్రజలకు ఇచ్చిన హామీలను అత్యంత శ్రద్ధతో అమలు పరచాలని, ప్రతిపాదనలు పంపి చేతులు దులుపుకోవడం కాకుండా పరిపాలనా అనుమతులు వచ్చే వరకు వెంటపడాలన్నారు.

మరిన్ని వార్తలు