వర్రీ!

1 Dec, 2015 00:05 IST|Sakshi
వర్రీ!

వాస్తవం: ఘణపురం ఆనకట్ట కింద కనుచూపు మేర.. వరి పంటలు  ఎండిపోవడం.. మెతుకుసీమ కరువుకు నిదర్శనం. ఈ ఏడాది 90 శాతం మేర వరి పంటలు ఎండిపోయాయి.

ప్రయత్నం: జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించడానికి మంత్రి హరీశఖరావు ఒక యజ్ఞమే చేశారు. కరువు నిబంధనలను మదించి, ఒక్కొక్క అవకాశాన్ని ఉపయోగించి 46 మండలాలను ఆ జాబితాలో చేర్పించారు.

నిర్లక్ష్యం: ‘జిల్లాలో ఈ ఏడాది 90 వేల మెట్రిక్ టన్నుల వరిధాన్యం ఉత్పత్తి అయ్యింది. వరి ధాన్యానికి కరువు లేదు’ అని అధికారిక నివేదిక పంపిన జిల్లా యంత్రాంగం.

అధికారులు.. నిర్లక్ష్యంగా పంపిన ఓ నివేదిక వరి రైతు కడుపు కొట్టనుంది. వరుస కరవుతో విలవిల్లాడుతున్న అన్నదాతకు ఉపశమనం కల్పించేందుకు ‘కరవు ప్రకటనపై’ భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశఖరావు, ప్రజా ప్రతినిధులు చేసిన ప్రయత్నానికి అధికారులు గండి కొట్టారు. ఐకేపీ సంస్థకు డబ్బు సమకూర్చడానికి జిల్లాలో వరి దిగుబడి బాగా ఉందని పంపిన నివేదికతో వరి రైతులకు కేంద్రం ప్రకటించే కరువు ప్రయోజనాలు అందకుండా పోతున్నాయి.

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: జిల్లాలో గత ఏడాది 36 వేల హెక్టార్లలో  వరి వేయగా... 91.68 వేల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ఉత్పత్తి అయింది. 178 ఐకేపీ కేంద్రాల్లో వీటిని కొనుగోలు చేశారు. ఈ ఏడాది పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. అధికారిక అంచనాల ప్రకారమే 25 వేల హెక్టార్లలో వరి పంట వేయగా వర్షాలు లేక పంట పాలుపోసుకునే, పొట్టకొచ్చే దశల్లో ఎండిపోయింది. వ్యవసాయ శాఖ అధికారుల అంచనా ప్రకారం ఇప్పటి వరకు కేవలం 238 హెక్టార్లలో మాత్రమే వరి ధాన్యం చేతికి అందింది. గత ఏడాదితో పోలిస్తే 90 శాతం పంట నష్టం జరిగింది. కానీ అధికారులు వాస్తవ వివరాలను పక్కన పెట్టి ఐకేపీ సంస్థకు నిధులు రాబట్టడం కోసం ఓ తప్చడు నివేదిక అందించడంతో వరి రైతుకు ఇబ్బందిగా మారింది.

 రా? ప్రభుత్వం ఐకేపీ, ప్రజా పంపిణీ సంస్థల ద్వారా వరిధాన్యం కొనుగోలు చేస్తుంది. గత ఏడాది 178 కొనుగోలు కేంద్రాల ద్వారా  91.68 మెట్రిక్ టన్నుల వరి దాన్యం కొనుగోలు చేశారు. అయితే ఈ సంస్థలు ధాన్యం కొనుగోలు చేయడానికి అవసరమైన డబ్బును సమకూర్చడం కోసం అధికారులు ముందస్తుగానే ధాన్యం దిగుబడి అంచనాకు సంబందించిన నివేదిక ప్రభుత్వానికి పంపుతారు. అధిక నిధులు రాబట్టడం కోసం  వ్యవసాయ, డ్వామా అధికారులు గత ఏడాది వరి పంట ఉత్పత్తి నివేదికనే కొత్తగా తయారు చేసి 91.68 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చినట్లు నివేదించారు. ఈ నివేదికనే కేంద్రం ప్రభుత్వం ఆధారం చేసుకుంటున్నట్లు సమాచారం. వరికి కరువు లేనప్చడు  ఇనఖపుటఖ సబ్సిడీ ప్రయోజనాల వర్తింపు వరి ధాన్యానికి మినహాయించే యోచనలో ఉన్నట్లు అంత్యంత విశ్వనీయంగా తెలిసింది.

ఇవి దూరం: కరువు మండలంగా ప్రకటిస్తే.... కరువు రైతును ఆదుకోవడం కోసం  ప్రతి హెక్టారుకు ప్రభుత్వం రూ 10 వేల పంట నష్టపరిహారం ఇవ్వడంతో పాటు, పంట రుణాలను రీ షెడ్యూలఖ చేసే అవకాశం ఉంటుంది.  ఎరువులు విత్తనాలు  సబ్సిడీ మీద అందిస్తారు. ఇది అన్నదాతలకు కొంత ఊరటనిస్తుంది. అధికారుల నిర్లక్ష్యపు నివేదిక మూలంగా వరి రైతు పై ప్రయోజనాలకు దూరమయే పరిస్థితి ఏర్పడింది.
 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు