ట్యాంక్‌బండ్‌ వద్ద ట్రాఫిక్‌ ఆంక్షలు

14 Apr, 2018 08:59 IST|Sakshi

సాక్షి, సిటీబ్యూరో: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ జయంతి ఉత్సవాలు నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్‌ మళ్లింపులు విధిస్తూ పోలీసులు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ట్యాంక్‌ బండ్‌ చౌరస్తా కేంద్రంగా శనివారం రాత్రి 8 గంటల వరకు ఇవి అమలులో ఉంటాయి. ఆహుతులకు ప్రత్యేక పార్కింగ్‌ ప్రదేశాలు కేటాయించారు.  
కర్బాలామైదాన్‌ నుంచి అప్పర్‌ ట్యాంక్‌బండ్‌ వైపు వచ్చే ట్రాఫిక్‌ను సైలింగ్‌ క్లబ్‌  నుంచి కవాడీగూడ చౌరస్తా, డీబీఆర్‌ మిల్స్, ధోబీఘాట్, కట్టమైసమ్మ టెంపుల్, తెలుగుతల్లి ఫ్లైఓవర్‌ మీదుగా పంపుతారు.
ఎన్టీఆర్‌ ఘాట్‌ నుంచి లిబర్టీ వైపు వెళ్లే ట్రాఫిక్‌ను అంబేడ్కర్‌ స్టాట్యూ వైపు అనుమతించరు. వీరు తెలుగుతల్లి చౌరస్తా నుంచి రైట్‌ టర్న్‌ తీసుకుని ఇక్బాల్‌ మీనార్, రవీంద్రభారతి, పోలీసు కంట్రోల్‌రూమ్, బషీర్‌బాగ్‌
మీదుగా వెళ్లాలి.
సైఫాబాద్‌ పాత పోలీసుస్టేషన్‌ నుంచి లిబర్టీ వైపు వెళ్లే వాహనాలు అంబేడ్కర్‌ స్టాట్యూ వైపు వెళ్లకుండా ఇక్బాల్‌ మీనార్‌ నుంచి రవీంద్రభారతి, పోలీసు కంట్రోల్‌రూమ్, బషీర్‌బాగ్‌ మీదుగా వెళ్లాలి.
సాధూరామ్‌ కంటి ఆసుపత్రి నుంచి సెక్రటేరియేట్‌ వైపు వెళ్లే ట్రాఫిక్‌ లిబర్టీ నుంచి కుడి వైపు తిరిగి మొఘల్‌ దర్బార్‌ హోటల్, జీహెచ్‌ఎంసీ కార్యాలయం మీదుగా వెళ్లాలి.

మరిన్ని వార్తలు