దేశ రాజకీయాల్లో టీఆర్‌ఎస్‌ కీలకం

18 Mar, 2018 10:41 IST|Sakshi

మంత్రి జోగురామన్న

మిషన్‌ భగీరథ పనులు పరిశీలన 

త్వరలోనే ‘మిషన్‌’ ద్వారా శుద్ధజలం

నేరడిగొండ(బోథ్‌): దేశ రాజకీయాల్లో టీఆర్‌ఎస్‌ కీలక పాత్ర పోషించనుందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగురామన్న అన్నా రు. శనివారం మండలంలోని ఆరెపల్లి సమీపంలోని అటవీ ప్రాంతంలో నిర్మించిన మిషన్‌ భగీరథ గ్రౌండ్‌ లెవల్‌ బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ను బోథ్‌ ఎమ్మెల్యే రాథోడ్‌ బాపూరావుతో కలిసి మంత్‌ రిపరిశీలించారు. భారీనీటి సామర్థ్యంతో నిర్మించిన జీఎల్‌బీఆర్‌ లోకి దిగి పంప్‌హౌజ్‌లో నిర్మించిన ఇన్‌లెట్, ఔట్‌లెట్‌ పనులతో పాటు పంప్‌హౌజ్‌కు సంబంధించిన మ్యాప్‌ను పరిశీలించారు. నిర్మల్‌ జిల్లాలోని మాటేగాం నుంచి ఆరెపల్లి పంప్‌హౌజ్‌ వరకు వచ్చే పైపులైన్‌తో పాటు ఆరెపల్లి పంప్‌హౌజ్‌ నుంచి ఆదిలాబాద్‌ పట్టణానికి వచ్చే పైపులైన్‌ పూర్తయిన పనులను పరిశీలించి అధికారులతో మాట్లాడి వివరాలను తెలుసుకున్నారు. మిషన్‌ భగీరథ పథకాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతుందని, త్వరలోనే ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఇంటింటికీ నల్లాల ద్వారా తాగునీరు అందించనున్నట్లు తెలిపారు. అనంతరం కొర్టికల్‌లో ఎంపీపీ బర్దావల్‌ సునిత నివాసంలో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఆయన వెంట జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రావుత్‌ మనోహర్, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు అడ్డి భోజారెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల కన్వీనర్‌ కమల్‌సింగ్, కొర్టికల్‌ సర్పంచ్‌ ఆడె రవీందర్, బోథ్‌ వ్యవసాయ మార్కెట్‌ కమిటీ ఉపాధ్యక్షుడు దావుల భోజన్న, జిల్లా నాయకులు రాథోడ్‌ సజన్, నారాయణసింగ్, ప్రేమ్‌సింగ్, యూనుస్‌అక్బానీ, ఖయ్యుం, రవి, తేజ్‌రావు, తదితరులు ఉన్నారు. 

మరిన్ని వార్తలు