రూ. 1600 కోట్లతో నియోజకవర్గ అభివృద్ధి

9 Nov, 2018 12:40 IST|Sakshi
అర్వపల్లి : సీతారాంపురంలో ప్రచారం

సాక్షి,అర్వపల్లి: గత 60 ఏళ్లలో జరగని అభివృద్ధి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్‌ హయాంలో నాలుగేళ్లలో  రూ. 1600 కోట్లతో జరిగిందని టీఆర్‌ఎస్‌ జిల్లా నాయకుడు దావుల వీరప్రసాద్‌ చెప్పారు. తుంగతుర్తి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గాదరి కిశోర్‌కుమార్‌ గెలుపు కోసం గురువారం సీతారాంపురంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కిశోర్‌కుమార్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు బందెల అర్వపల్లి, రాసాల సైదులు, బందెల వెంకన్న, చిత్రాల వీరయ్య, బందెల శశికాంత్, కుర్రె రమేశ్, ఎ. భద్రయ్య, బైరబోయిన రామలింగయ్య, పెద్దయ్య, కె. శ్రీకాంత్, జి. రామ్మూర్తి, ఎస్‌. వెంకన్న, ఎ. వెంకన్న, కె. భిక్షం, ఎ. సంతు, ఎ. ప్రవీణ్, పి. శ్రీను, ఎ. లింగయ్య, వీరమల్లు, ఎ. సంతు, దావుల లింగయ్య, కె. నాగరాజు, పి. ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు.  
వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ గెలుపు ఖాయం
తుంగతుర్తి : త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ గెలుపు ఖాయమని టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు పూసపల్లి శ్రీనివాస్‌ అన్నారు. బుధవారం మండల కేంద్రంలో  ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే టీఆర్‌ఎస్‌తోనే సాధ్యమన్నారు. సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే టీఆర్‌ఎస్‌ పార్టీని గెలిపిస్తాయన్నారు. తుంగతుర్తి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన ఘనత గాదరి కిశోర్‌కుమాదే అని కొనియాడారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు కారుగుర్తుకు ఓటేసి టీఆర్‌ఎస్‌పార్టీని గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో వెంకటనారాయణ, జలేందర్, రాములు, సంతోష్, భిక్షం, వెంకన్న, హరీశ్‌ తదితరులు పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు