టీఆర్‌ఎస్‌ గెలుపును ఆపలేరు

13 Nov, 2018 18:05 IST|Sakshi
మహమ్మద్‌నగర్‌లో మాట్లాడుతున్న ఎంపీ బీబీ పాటిల్‌

ఎన్ని కూటములు కట్టినా విజయం మాదే..

60 ఏళ్ల పాలనలో జరగని అభివృద్ధి నాలుగేళ్లలో చేశాం

గడపగడపకు సంక్షేమ పథకాలు

జహీరాబాద్‌ ఎంపీ బీబీ పాటిల్‌

 సాక్షి,నిజాంసాగర్‌(జుక్కల్‌): కాంగ్రెస్, టీడీపీల అరవై ఏళ్ల పాలనలో చేపట్టని అభివృద్ధిని నాలుగేళ్లలో చేశామని జహీరాబాద్‌ ఎంపీ బీబీ పాటిల్, జెడ్పీ చైర్మన్‌ దఫేదార్‌రాజు తెలిపారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఉద్యమించిన సీఎం కేసీఆర్‌ రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేశారన్నారు. జుక్కల్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి హన్మంత్‌ సింధే బీఫారం తీసుకొని సోమవారం నియోజకవర్గానికి వచ్చిన సందర్భంగా పార్టీ నేతలు, కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అంతకు ముందు భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు.

ఎంపీ బీబీ పాటిల్‌ మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు గడపగడపకు చేరాయని, ఆయా పథకాలకు ఆకర్షితులైన ప్రజలు టీఆర్‌ఎస్‌కు జైకొడుతున్నారని చెప్పారు. కాంగ్రెస్‌ నేతలు ఎన్ని కూటములు కట్టినా టీఆర్‌ఎస్‌ గెలుపును ఆపలేరని తెలిపారు. వచ్చే ఏడాది జూన్‌ నాటికి కాళేశ్వరం జలాలు నిజాంసాగర్‌ ప్రాజెక్టుకు రావడం ఖాయమని, ఎత్తిపోతల ద్వారా గోదావరి జాలాలతో నిజాంసాగర్‌ ఆయకట్టుకు మహర్దశ రానుందని ఎంపీ బీబీ పాటిల్‌ పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌ నేతలు దుర్గారెడ్డి, విఠల్, మోహిజ్, గంగారెడ్డి, సత్యనారాయణ, వాజిద్‌ అలీ, నర్సింహులు, సాయాగౌడ్, సురేందర్, కాశయ్య, జీవన్, రమేశ్‌యాదవ్, ఇఫ్తాకర్, రాజేశ్వర్‌గౌడ్, సంఘమేశ్వర్‌గౌడ్, బేగరి రాజు, శ్రీనివాస్‌రెడ్డి, శ్రీను, రమేశ్‌గౌడ్, ఆనంద్‌కుమార్, విజయకుమార్, ప్రకాశ్‌ తదితరులు పాల్గొన్నారు.

నేడు నామినేషన్‌ వేయనున్న సింధే 

నిజాంసాగర్‌(జుక్కల్‌): జుక్కల్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి తాజా మాజీ ఎమ్మెల్యే హన్మంత్‌ సింధే మంగళవా రం ఎన్నికల నామినేషన్‌ వేయనున్నారు. మద్నూ ర్‌ మండల కేంద్రంలో ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి నామినేషన్‌ పత్రాలను సమర్పించనున్నారు. ఈ కార్యక్రమానికి ఎంపీ బీబీ పాటిల్, జెడ్పీ చైర్మన్‌ దఫేదార్‌ రాజు, ఎమ్మెల్సీ రాజేశ్వర్‌ హాజరు కానున్నారని పార్టీ నేతలు తెలిపారు.  

>
మరిన్ని వార్తలు