మాఫీకి మాదే భరోసా!

26 Sep, 2014 00:10 IST|Sakshi
మాఫీకి మాదే భరోసా!

ఆర్థిక, పౌర సరఫరాలశాఖ మంత్రి ఈటెల రాజేందర్
సాక్షి, హైదరాబాద్: రైతుల రుణ మాఫీ, విద్యుత్‌పై ప్రతిపక్షాలు విషప్రచారం చేస్తున్నాయని, వారి మాటలు నమ్మవద్దని తెలంగాణ ఆర్థిక, పౌర సరఫరాలశాఖ మంత్రి ఈటెల రాజేందర్ పేర్కొన్నారు. ప్రతిపక్షాలు, పత్రికలే తప్పుడు కథనాలతో రైతుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తున్నాయని  మండిపడ్డారు. రైతుల ఆత్మహత్యలకు వారే కారణమవుతున్నారన్నారు. సచివాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రైతులకు రూ. లక్ష లోపు రుణాల మాఫీకి తాము భరోసా ఇస్తున్నామన్నారు.

కొత్త రుణాలు ఇచ్చేలా చర్యలు చేపట్టామని, ఎక్కడైనా బ్యాంకర్లు ఇబ్బందిపెడితే రెవెన్యూ, వ్యవసాయశాఖ అధికారులు కల్పించుకొని రుణాలు ఇప్పించేందుకు అవసరమైన చర్యలు చేపడతారని చెప్పారు. కాగా, తెలంగాణలో 7,816 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఉండగా, 4,400 మెగావాట్లు మాత్రమే ఉత్పత్తి అవుతుందని, 2,300 మెగావాట్ల విద్యుత్ కొరత ఉందన్నారు. 2017 జూన్ నాటికి కోతలే ్లని కరెంటు ఇచ్చేందుకు చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. ప్రతిపక్షాలు మొసలి కన్నీరు కార్చుతున్నాయనీ, వారి మోసాల ఉచ్చులో చిక్కుకోవద్దన్నారు. ఈ విషయంలో ఆంధ్ర పత్రికలు విషం కక్కుతున్నాయన్నారు.

మరిన్ని వార్తలు