సాయం కోరితే తక్షణమే స్పందించిన కేటీఆర్

28 Apr, 2017 17:06 IST|Sakshi
సాయం కోరితే తక్షణమే స్పందించిన కేటీఆర్

హైదరాబాద్: తెలంగాణకు చెందిన ఓ బాధితుడి కుటుంబానికి సాయం చేయాలని కోరిన తక్షణమే రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీశాఖల మంత్రి కేటీఆర్ స్పందించారు. బాధిత సౌదీ కార్మికుడి కుటుంబానికి సాయం చేస్తామని ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఆ వివరాలిలా ఉన్నాయి. తెలంగాణకు చెందిన రాజయ్య కుమారుడు కులెరు దేవరాజు జీవనోపాధి కోసం సౌదీ అరేబియా, సల్వా డామ్మమ్‌లో ఉంటున్నాడు. ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న దేవరాజ్ ఈ నెల 5వ తేదీన ఓ ప్రమాదంలో మృతిచెందాడు.

ఈ విషయాన్ని విద్యాసాగర్ దొండ అనే వ్యక్తి తన ట్విట్టర్ ద్వారా కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. దేవరాజు పనిచేసే కంపెనీ యాజమాన్యం ఎలాంటి సాయం చేయడం లేదని, దయచేసి శవాన్ని మృతుడి స్వస్థలానికి తెప్పించాలని ట్వీట్ చేశాడు. విద్యాసాగర్ ట్వీట్ చేసిన కొన్ని నిమిషాల్లోనే మంత్రి కేటీఆర్ స్పందిస్తూ.. తప్పకుండా సాయం చేస్తామని హామీ ఇచ్చారు. మృతదేహాన్ని బాధితుడి స్వస్థలానికి తెప్పిస్తామని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు