వైఎస్సార్‌ తర్వాత కేసీఆరే : పోచారం శ్రీనివాస్‌రెడ్డి  

5 Dec, 2018 13:25 IST|Sakshi
బాన్సువాడలో మాట్లాడుతున్న మంత్రి పోచారం, పక్కన తజ్ముల్‌ 

సంక్షేమ పథకాల అమలులో

బాన్సువాడ ఎమ్మెల్యే అభ్యర్థి పోచారం శ్రీనివాస్‌రెడ్డి

 పోచారానికి వైఎస్సార్‌ సీపీ మద్దతు

సాక్షి, బాన్సువాడ టౌన్‌(బాన్సువాడ): సంక్షేమ పథకా లు అమలు చేయడంలో దివంగత సీఎం వై.ఎస్‌. రాజశేఖర్‌రెడ్డి తర్వాత ఆపద్ధర్మ సీఎం కేసీఆరే అని బాన్సువాడ ఎమ్మెల్యే అభ్యర్థి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మంగళవారం వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షులు తజ్ముల్‌ బాన్సువాడలో పోచారంను కలిసి ఆయనకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ పేదల కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల అమలులో వైఎస్‌ తర్వాత కేసీఆర్‌ ముందుంటారని అన్నారు. రైతులకు మేలు చేసిన వైఎస్‌ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని కోరుతున్నట్లు ఆయన అన్నారు.

టీఆర్‌ఎస్‌కు వైఎస్సార్‌ సీపీ మద్దతు ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని, వర్ని మండలంలో ఏ సమస్యలున్నా తజ్ముల్‌కు చెప్పాలని, తన దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కారిస్తానని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు ఇస్తామన్నారు. కార్యక్రమంలో పోచారం రవీందర్‌రెడ్డి, వైఎస్సార్‌ సీపీ జిల్లా కార్యదర్శి,  టీఆర్‌ఎస్‌ నాయకులు భాస్కర్‌రెడ్డి, కృష్ణారెడ్డి, అంజిరెడ్డి, బద్యనాయక్‌ తదితరులు ఉన్నారు. అలాగే బాన్సువాడ నియోజకవర్గం నుంచి పిరమిడ్‌ పార్టీ తరుపున పోటీ చేస్తున్న కొండని అంజయ్య శ్రీనివాస్‌రెడ్డికి, టీఆర్‌ఎస్‌ పార్టీకి తన  మద్దతు తెలిపారు. అలాగే మండలంలోని రాంపూర్‌ ముదిరాజ్‌ సంఘం సభ్యులు టీఆర్‌ఎస్‌కు మద్దతు తెలిపారు.

మరిన్ని వార్తలు