ఇవి రేషన్‌ బియ్యమేనా?

12 Jul, 2018 09:04 IST|Sakshi
రేషన్‌బియ్యంలో పురుగులు  

నవాబుపేట: ప్రభుత్వం పేద ప్రజల కోసం రూపాయికే కిలో రేషన్‌ బియ్యం పథకం ప్రవేశపెట్టింది. కాని ఈ నెల ప్రజలకు పురుగులు, మట్టితో నిండిన బియ్యం పంపిణీ చేశారు. దీంతో ప్రజలు ఆ బియ్యాన్ని తీనాలంటేనే జంకుతున్నారు.  వివరాల్లోకి వెళ్తే.. ఈ నెల సరఫరా చేసినా బియ్యం పందికొక్కులు తినగా మిగిలిన బియ్యంగా ఉన్నాయి. ప్రభుత్వమే ఇలాంటి బియ్యం సరఫరా చేస్తుందా, లేక గోదాంలో ఏమైనా తారుమారు అవుతున్నాయో తెలియని పరిస్థితి నెలకొంది.

గత రెండు రోజులుగా మండలంలోని 44 రేషన్‌ షాపుల్లో రేషన్‌ బియ్యాన్ని డీలర్లు విక్రయిస్తున్నారు. దాదాపు అన్ని షాపుల్లో విక్రయిస్తున్న రేషన్‌ బియ్యంలో నల్లటి పురుగులు, దుమ్ముధూళితో అధ్వానంగా ఉన్నాయి. బియ్యం ఇలా ఉన్నాయని పలువురు రేషన్‌ డీలర్లను ప్రశ్నించగా తమకు తెలియదని గోదాం నుంచి వచ్చిన బియ్యాన్నే తాము విక్రయిస్తున్నట్లు చెప్పారు. చేసేదేమీ లేక ప్రజలు అధ్వానంగా ఉన్న బియ్యాన్ని తీసుకెళ్లారు.  

అధికారుల దృష్టికి తీసుకెళ్తా

రేషన్‌ బియ్యంలో పూర్తిగా పురుగులు, దుమ్ముధూళి ఉండటంతో ఆ బియ్యాన్ని ప్రజలు తినలేని పరిస్థితి నెలకొంది. అధ్వానంగా ఉన్న బియ్యం సరఫరా చేస్తే తాము ఎలా తినాలని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై తహసీల్దార్‌ శ్రీనివాస్‌ను వివరణ కోరగా బియ్యంలో పురుగులు వచ్చాయని చాలా గ్రామాల నుంచి తమకు ఫిర్యాదులు వచ్చాయని, ఈ విషయాన్ని ఉన్నతాధికారులు, సివిల్‌సప్లయి అధికారులకు లేక రాస్తున్నట్లు ఆయన తెలిపారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

హెరిటేజ్‌ ఓ జోక్‌లా మారింది!

7 కొత్త కార్పొరేషన్లు

నీళ్ల నిలువను, విలువను తెలిపే థీమ్‌పార్క్‌ 

నిలబెట్టుకోలేక నిందలా!

‘ఎన్‌కౌంటర్లపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాల్సిందే ’

బీజేపీలో నాకు తలుపులు మూసుకుపోలేదు..

నాగార్జున ఇంటి వద్ద పోలీసు బందోబస్తు

ఈనాటి ముఖ్యాంశాలు

కేటీఆర్‌.. మీతో ఛాయ్‌ కా, ఇంకేమైనా ఉందా?

మున్సిపల్‌ ఎన్నికలకు ఎందుకంత హడావుడి?

గెలుపు ఓటముల్లో అతివలదే హవా..

లక్ష మందితో బహిరంగ సభ: ఎమ్మెల్యే

ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగల అరెస్టు

రామయ్యా.. ఊపిరి పీల్చుకో 

బాలిక కిడ్నాప్‌ కలకలం 

మాటలు కలిపాడు..మట్టుపెట్టాడు

కాంగ్రెస్‌ సభ్యుల నిరసన; కేసీఆర్‌ స‍్పందన

మనకూ ‘ముంబై’ ముప్పు

‘కాంగ్రెస్‌ అనాథగా మారిపోయింది’

పట్నంలో అడవి దోమ!

ఆత్మహత్య చేసుకున్న ఇద్దరు యువకులు

బైకుల దొంగ అరెస్ట్‌

కేఎంసీ వర్సెస్‌ ఎంజీఎం 

'మస్ట్‌'బిన్‌ లేకుంటే జరిమానాల దరువు

కొత్తపట్నం ఏర్పాటు ఇలా..

నీళ్లు ఫుల్‌

నగరంలోకి ఎలక్ర్టికల్‌ బస్సులు

వివాహేతర సంబంధం పెట్టుకుందని..

ద.మ.రై.. వంద రైళ్ల వేగం పెంపు..

అణచి వేసేందుకే మావోయిస్టు ముద్ర

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అడ్డంకులు మాయం!

కుశాలీ ఖుషీ

నిశ్శబ్దాన్ని విందాం

నేనంటే భయానికి భయం

సినిమాలో చేసినవి నిజంగా చేస్తామా?

వందమందితో డిష్యూం డిష్యూం