Sakshi News home page

హత్య చేసి తగుల బెట్టారు..

Published Thu, Jul 12 2018 9:03 AM

Murder Case Reveals After One Year In Chittoor - Sakshi

రొంపిచెర్ల: వివాహేత సంబంధాలతో పరువు మంటగలుపుతోందన్న కారణంతో భార్యను.. ఆమె భర్త , బావ హత్య చేసి చెరువులో పూడ్చి వేశారు. వర్షాలకు శవాన్ని గుర్తించే అవకాశం ఉందనే భయంతో కొద్ది రోజుల తర్వాత శవాన్ని వెలికి తీసి పెట్రోల్‌ పోసి తగుల బెట్టారు. అప్పట్లో అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసిన పోలీసులు.. ఏడాది తర్వాత రహస్య సమాచారంతో అది హత్యే అని తేల్చారు. ఈ ఘటన రొంపిచెర్ల మండలం పెద్దమల్లెల పంచాయతీలో జరిగింది. పీలేరు రూరల్‌ సీఐ నరిసింహుమూర్తి  బుధవారం తెలియజేసిన వివరాల మేరకు.. పెద్దమల్లెల పంచాయతీ దుస్సావాండ్లపల్లెకు చెందిన నాగిరెడ్డి(38), వాల్మీకిపు రం మండలం పాత మంచూరుకు చెందిన అనిత(30) భార్యా భర్తలు. వీరికి 9 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. వీరు బతుకుదెరువు కోసం పదేళ్ల కిందట బెంగుళూరుకు వెళ్లారు. అక్కడ ఇళ్లలో పని చేసుకొని జీవనం సాగించేవారు. అయితే అనిత ఇదే అదునుగా ఇళ్ల యజమానులతో అక్రమ సంబంధం పెట్టుకుంది.

దీంతో భార్య వ్యవహా రాన్ని భర్త నాగిరెడ్డి కుటుంబ సభ్యులకు తెలిపాడు. వారంతా అనితను హెచ్చరించారు.  అయితే ఆమె పద్ధతిలో మార్పు రాలేదు. ఇదే విషయాన్ని నాగిరెడ్డి తన అన్న కృష్ణారెడ్డి(43)కి తెలిపాడు. వీరిద్దరు అనితను అంతమొందించాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో 2017 జూన్‌లో మదనపల్లెలో కుమారుడిని ప్రైవేటు పాఠశాలలో చేర్పించాలని, ముందుగా వెళ్లి పాఠశాలను చూసి వద్దామ ని నమ్మబలికారు. మార్గమధ్యంలో ఓమిని వ్యాన్‌లో అనితను నాగి రెడ్డి, కృష్ణారెడ్డి అంతమొందించారు. స్వగ్రామానికి వచ్చి తన పొ లం పక్కనే ఉన్న చెరువులో పూడ్చి పెట్టారు. అనంతరం మూడు రోజుల తర్వాత మళ్లీ శవాన్ని బయటకు తీసి పెట్రోల్‌ పోసి కాల్చి వేసి మళ్లీ పూడ్డి వేశారు. ఎవరికీ అనుమానం రాకుండా బెంగళూరుకు వెళ్లి పోయారు. వర్షానికి మట్టి కొట్టుకు పోయి శవం బయటపడడంతో వీఆర్‌ఓ యల్లయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు అప్పుటి  రొం పిచెర్ల ఎస్‌ఐ రహీముల్లా అప్పట్లో అనుమానాస్పద కేసుగా నమో దు చేశారు. ఈ క్రమంలో ఇటీవల గ్రామస్తులు కొందరు ఈహత్య కేసుకు సంబంధించి సీఐ నరసింహమూర్తికి  రహస్య సమాచారం ఇచ్చారు. దీంతో సీఐ నిందితులను అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో నిందితులు నేరం ఒప్పుకోవడంతో ఇద్దరినీ అరెస్టు చేసి పీలేరు కోర్డులో హాజరు పరిచినట్లు సీఐ విలేకరులకు బుధవారం తెలిపారు. రొంపిచెర్ల ఎస్‌ఐ ప్రసాద్‌ పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement