‘భగీరథ’ పనుల్లో వేగం పెంచాలి

7 Jan, 2018 13:01 IST|Sakshi

26న ట్రయల్‌ రన్‌ నిర్వహించాల్సిందే..

నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవు

పథకం వైస్‌ చైర్మన్‌ వేముల ప్రశాంత్‌రెడ్డి

అధికారులు, కాంట్రాక్టర్లు, ఏజెన్సీలతో సమీక్ష 

హాజరైన సీఎం కార్యాలయ సెక్రటరీ స్మితాసబర్వాల్‌

సాక్షి, మరిపెడ(వరంగల్‌): మిషన్‌ భగీరథ పనులను గడువులోగా పూర్తి చేసి ఈనెల 26న ట్రయల్‌ రన్‌ చేయాలని భగీరథ వైస్‌ చైర్మన్‌ వేముల ప్రశాంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. మహబూబాబాద్‌ జిల్లా మరిపెడ మండలం అబ్బాయిపాలెం ఎదళ్లగుట్ట వద్ద కొనసాగుతున్న మిషన్‌ భగీ రథ పనులపై శనివారం ఆయన ముఖ్యమంత్రి కార్యాలయ సెక్రటరీ స్మితా సబర్వాల్‌తో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ  రాష్ట్రంలో 24 వేల పై చిలుకులు గ్రామాలకు శుద్దీచేసిన నీరు అందించాలనే లక్ష్యంతో సీఎం కే సీఆర్‌ మిషన్‌ భగీరథ పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు.

అబ్బాయిపాలెం నుంచి పాలకుర్తి, ములుగు, మహబూబాబాద్, నర్సంపేట, డోర్నకల్‌తో పాటు ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం తిరుమలాయపాలెం మండలానికి నీటి ని అందించనున్నట్లు ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. ఇందుకు రూ.1,700 కోట్లు ఖర్చు అంచనా వేసినట్లు తెలిపారు. అయితే అన్నింకంటే ముందుగా డోర్నకల్‌ నియోజకవర్గంలోని మరిపెడ, నర్సింహులపేట, కురవి, డోర్నకల్‌ మండలాలకు ఈనెల 15 వరకుభగీర«థ నీరందుతుందన్నారు. ఎదళ్లగుట్ట వద్ద జరుగుతున్న పనులు దాదాపు పూర్తయినట్లు తెలిపారు. గ్రామాల్లో ఏర్పాటు చేయాల్సిన పైపులైన్‌ పనులు 25 శాతం మాత్రమే మిగిలి ఉన్నాయని, అవి వారం రోజుల్లో పూర్తవుతాయన్నారు. 

అధికారులపై మండిపాటు..
బొడ్లాడ వద్ద జరుగుతున్న పనుల్లో జరుగుతున్న జాప్యంపై ప్రశాంత్‌రెడ్డి మండిపడ్డారు. అధికారుల మధ్య సమన్వయం లేకపోవడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి ఇలాంటి పరిస్థితి ఉత్పన్నం కావద్దని హెచ్చరించారు. అలాగే పరకాల నియోజకవర్గంలో జరుగుతున్న పనులు ఈనెల 8 వరకు పూర్తి చేస్తామని తెలిపారు. స్టేషన్‌ఘన్‌పూర్, ధర్మసాగర్, జనగామలో ఈనెల 30లోగా పూర్తవుతాయని, అయితే ఇక్కడ పైప్‌లైన్‌ నిర్మాణంలో జాప్యం జరుగుతోందని ఇది సహించే విషయం కాదని చైర్మన్‌ మందలించారు. ఇప్పటికైనా తీరు మార్చుకోకపోతే వేరే వారిని పెట్టుకుని పనులు చేయించుకుంటామని హెచ్చరించారు. ఏటూరునాగారం వద్ద జరుగుతున్న పనుల్లో ఎలక్ట్రోమెకానిక్‌ వర్క్స్‌ ఇంత వరకు పనులు ప్రారంభం కాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులు ఈనెల 15 వర కు పూర్తి చేస్తామని కాంట్రాక్టర్లు, అధికారులకు చెప్పా రు. జనగామ 180 ఇంట్రా విలేజ్‌లో పనులు కావాల్సి ఉందన్నారు. యాదాద్రిలో 569 పనులకు 207 పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ఇవన్ని ఈ నెల 20 వరకు పూర్తిచేస్తామని సమీక్షలో వెల్లడించారు.  

అధికారులకు స్వాగతం...
మరిపెడ శివారులోని ఎస్సీ గురుకులం సమీపంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌ స్థలంలో భగీరథ వైస్‌ చైర్మ న్‌ వేముల ప్రశాంత్‌రెడ్డి, సీఎం కార్యాలయ సెక్రటరీ స్మితా సబర్వాల్‌ దిగారు. ఈ సందర్భంగా వారికి మం త్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, ఎమ్మెల్యే రెడ్యానాయక్‌ స్వాగతం పలికారు.

ఏ రోజు నివేదిక ఆ రోజు ఇవ్వాలి..
ఈనెల 26న మిషన్‌ భగీరథ ట్రయల్‌ రన్‌ చేయాల్సిందేనని సీఎం కార్యాలయం సెక్రటరీ స్మితా సబర్వాల్‌ అన్నారు. కొంత మంది అధికారులు, కాంట్రాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, అది సరైందని పద్ధతి కాదన్నారు. అ«ధికారులు సమన్వయంగా పనిచేయాలని ఆమె సూచించారు. ప్రతి రోజు 24 గంటలు పనిచేసి గడువులోగా పనులు పూర్తి చేయాలని చెప్పారు. రేపటిలోగా ఎప్పటి వరకు పనులు పూర్తి చేస్తారో నివేదిక తీసుకో వాలని సీఎంసీ సురేంద్రరెడ్డికి సూచించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ పథకం పనుల ను గడువులోగా పూర్తి కాకుంటే నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరిం చారు. సమీక్షలో రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, డోర్నకల్‌ ఎమ్మెల్యే డీఎస్‌ రెడ్యానాయక్, ప్రభుత్వ సలహదారుడు జ్ఞానేశ్వర్,  జనగామ ఇన్‌చార్జి కలెక్టర్‌ అనితా రాంచంద్రన్, మహబూబాబాద్‌ జిల్లా జేసీ దామోదర్‌రెడ్డి, గుడిపుడి నవీన్, డి.ఎస్‌ రవిచంద్ర, మిషన్‌ భగీరథ అధికారులు, ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు, మెగా కన్‌స్ట్రక్షన్‌ కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు