వేమయ్యా.. వస్తావయ్యా..!

9 Jan, 2018 12:32 IST|Sakshi

కడప కార్పొరేషన్‌ : సంక్రాంతి పండుగ వస్తుందంటే పసుపు పచ్చని వస్త్రాలు ధరించి, తలపాగా చుట్టి, నుదుట ఎర్రటి బొట్టుతో గుర్రాలపై వచ్చే వేమయ్యలు, గంగిరెద్దులవారు స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలుస్తారు... వడ్లు, బియ్యం, బట్టలు ఇచ్చి వారి నుంచి ఆశీర్వాదాలు తీసుకుంటే మంచి జరుగుతుందని పెద్దలు భావిస్తారు. పూర్వం నుంచి ఇది సంప్రదాయంగా వస్తోంది. ఇటీవలి కాలంలో వేమయ్యల రాక తగ్గిపోయింది. గంగిరెద్దులు కూడా అక్కడక్కడా కనిపిస్తున్నాయంతే. ఈ ఆధునిక యుగంలో కూడా కొన్ని  కుటుంబాలు అదే వృత్తిగా జీవిస్తున్నాయి.  నాలుగైదు రోజుల్లో సంక్రాంతి పండుగ వచ్చేస్తున్న తరుణంలో కడపలో ఆర్టీసీ బస్టాండు వద్ద వేమయ్యలు సందడి చేశారు. కదిరికి చెందిన వీరయ్య, రామయ్య వేమయ్యల వేషధారణలో గ్రామాలు తిరుగుతూ సాంప్రదాయాలను కొనసాగిస్తున్నారు. ఆ చిత్రాలను ‘సాక్షి’ క్లిక్‌మనిపించింది.

మరిన్ని వార్తలు