ఉపాధ్యాయుడు విధులు ముగించుకొని.. ఇంటికి వెళ్తుండగా..

11 Nov, 2023 11:01 IST|Sakshi
రాథోడ్‌ అన్వేష్‌ (ఫైల్)

సాక్షి, ఆదిలాబాద్‌: ప్రతిరోజులాగే విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించి తిరిగి ఇంటికి వెళ్తున్న క్రమంలో ఓ ఉపాధ్యాయుడు రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన ఘటన శుక్రవారం మండలంలోని చించోలి గ్రామం వద్ద చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మండలంలోని వెంకటాపూర్‌ గ్రామానికి చెందిన రాథోడ్‌ అన్వేష్‌ (25) బోథ్‌ మండలంలోని పాట్నపూర్‌ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నాడు.

విధులు ముగించుకొని సాయంత్రం ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తుండగా బోలెరో వాహనాన్ని ఢీ కొనడంతో సంఘటన స్థలంలోనే మృతిచెందాడు. ఎస్సై సాయన్న మృతదేహాన్ని బోథ్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. మృతుడి తండ్రి మోతిలాల్‌ సైతం ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. తండ్రికి ఒక్కడే కొడుకు కావడంతో కుటుంబ సభ్యుల రోదనలు స్థానికులను కంటతడి పెట్టించాయి.

మరిన్ని వార్తలు