లక్ష మందితో బీజేపీ ‘జనగర్జన’..

10 Oct, 2023 07:58 IST|Sakshi
సభ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన జర్మన్‌టెంట్‌

నేడు జిల్లా కేంద్రానికి కేంద్ర హోంమంత్రి అమిత్‌షా 

డైట్‌ మైదానంలో బహిరంగసభ

ఆదిలాబాద్‌ కాషాయమయం

ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో హెలీప్యాడ్‌ ఏర్పాటు

ఆదిలాబాద్‌: షెడ్యూల్‌ విడుదలతో బీజేపీ ఎన్నికల శంఖారావం పూరిస్తుంది. ప్రచారంలో భా గంగా రాష్ట్రంలోనే తొలి బహిరంగ సభ ఆదిలాబాద్‌లో నిర్వహిస్తున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా మంగళవారం జిల్లా కేంద్రానికి విచ్చేయనున్నారు. ఈ బహిరంగసభకు జనగర్జనగా నామకరణం చేశా రు. డైట్‌ మైదానంలో మధ్యాహ్నం ఒంటి గంటకు సభ ప్రారంభం కానుంది.

రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, నేతలు బండి సంజయ్, ఈటల ఇతరత్రా ము ఖ్యనేతలతో పాటు పార్టీ రాష్ట్ర వ్యవహారాలు చూసే జాతీయనేతలు కూడా హాజరు కానున్నారు. ఈ స భ కోసం కొద్ది రోజులుగా భారీ ఏర్పాట్లు చేస్తున్నా రు. ఆదిలాబాద్‌ ఎంపీ సోయం బాపూరావు, పార్టీ జిల్లా అధ్యక్షుడు శంకర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  ప్రేమేందర్‌రెడ్డి పర్యవేక్షిస్తున్నారు. ఈ సభ ద్వారా బీజేపీ ఎన్నికల సమరశంఖం పూరించనుంది.

లక్ష జనసమీకరణ..
ఈ సభ కోసం బీజేపీ భారీగా ఏర్పాట్లు చేసింది. డైట్‌ మైదానంలో నిర్వహిస్తుండగా ప్రాంగణంలో జర్మన్‌ టెంట్‌ ఏర్పాటు చేశారు. ఎలాంటి వాతావరణంలోనైనా ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకే ఈ ఏర్పాట్లు చేశారు. ఇదిలా ఉంటే ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి సుమారు లక్ష జనాన్ని సమీకరించేలా ప్రణాళిక చేశారు. ఆయా నియోజకవర్గాల బాధ్యులు జనసమీకరణపై దృష్టి సారించారు. 

కాషాయమయం..
బీజేపీ జనగర్జన సభ నేపథ్యంలో ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రం పూర్తిగా కాషాయమయంగా మారిపోయింది. పట్టణంలోని డివైడర్‌ పొడవునా, ముఖ్య కూడళ్లలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.  చౌక్‌లను పార్టీ జెండాలతో నింపేశారు. ఎన్నికల తొలి బహిరంగ సభ కావడం, కేంద్ర హోంమంత్రితో పాటు జాతీయ, రాష్ట్ర ముఖ్య నేతలు వస్తుండటంతో భారీ ఏర్పాట్లు ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇదిలా ఉంటే స్థానిక ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో హెలీప్యాడ్‌ ఏర్పాటు చేశారు. హోంమంత్రి హెలీక్యాప్టర్‌ అక్కడ దిగనుంది. అక్కడి నుంచి ప్రత్యేక వాహనం ద్వారా డైట్‌ మైదానానికి చేరుకుంటారు. అడుగడునా బందోబస్తు ఏర్పాటు చేశారు. అమిత్‌ షా జెడ్‌ప్లస్‌ సెక్యూరిటీలో ఉండడంతో పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు కలెక్టర్‌ రాహుల్‌రాజ్, ఎస్పీ డి.ఉదయ్‌కుమార్‌ ఏర్పాట్లను పర్యవేక్షించారు. హెలీప్యాడ్‌ స్థలంతో పాటు బహిరంగ సభ స్థలాన్ని పరిశీలించారు.  

మరిన్ని వార్తలు