రికార్డు స్థాయిలో కరోనా నిర్ధారణ పరీక్షలు

31 Jul, 2020 17:39 IST|Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో కరోనా నిర్ధారణ పరీక్షలు రోజురోజుకూ రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 61,699 శాంపిల్స్‌ పరీక్షించగా.. 10,376 మంది కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యారు. 68 మంది మృత్యువాత పడ్డారు. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,38,038కి చేరగా.. మృతుల సంఖ్య 1,349కి పెరిగింది. గడిచిన 24 గంటల్లో వైరస్‌ నుంచి కోలుకుని 3,822 మంది డిశ్చార్‌ అయ్యారు. దీంతో ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 60,969 కి చేరింది. ప్రస్తుతం 75,720 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. మరోవైపు ఇప్పటి వరకు 19,51,776 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. (ప్లాస్మా దాతలకు రూ.5వేలు: సీఎం జగన్‌)

మరిన్ని వార్తలు