శ్రీవారిని దర్శించుకున్న 6278 మంది భక్తులు

29 Jul, 2020 22:43 IST|Sakshi

సాక్షి, తిరుమల : తిరుమల శ్రీవారిని బుధవారం 6278 మంది భక్తులు దర్శించుకున్నారు. నేడు శ్రీవారి హుండీ ఆదాయం 52 లక్షలు వచ్చింది. 2248 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.(రాజమౌళి, ఆయన కుటుంబసభ్యులకు కరోనా)

తిరుమల శ్రీవారి ఆలయంలో జూలై 30 నుంచి ఆగస్టు 1వ తేదీ వరకు పవిత్రోత్సవాలు జరుగనున్న నేప‌థ్యంలో బుధ‌వారం అంకురార్ప‌ణ కార్య‌క్ర‌మంలో భాగంగా ఉదయం శాస్త్రోక్తంగా ఆచార్య ఋత్విక్ వ‌ర‌ణం నిర్వ‌హించారు. శ్రీవారి మూలవిరాట్‌ ఎదుట ఆచార్య ఋత్విక్‌వరణం నిర్వ‌హించారు. ఏడాది పొడవునా శ్రీవారి ఆలయంలో జరిగే పూజలు, ఉత్సవాల్లో యాత్రికుల వల్లగానీ, సిబ్బంది వల్లగానీ తెలిసీ, తెలియక జరిగే దోషాల వల్ల ఆలయ పవిత్రతకు దోషం కలగకుండా.. ఆగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. మొదటి రోజున పవిత్రాల ప్రతిష్ట, రెండవ రోజు పవిత్రల సమర్పణ, ఆఖరి రోజున పూర్ణాహుతి నిర్వహిస్తారు. ఉత్సవాలు జరిగే ఈ మూడురోజుల పాటు ఆర్జిత సేవలను రద్దు చేశారు.

>
మరిన్ని వార్తలు