క్రికెట్‌ లీగ్‌లో గ్లోబల్ స్టార్.. ఏ జట్టో తెలుసా?

24 Dec, 2023 12:28 IST|Sakshi

గ్లోబర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రానికి శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇటీవలే షూటింగ్‌కు కాస్తా గ్యాప్ ఇచ్చిన మెగా హీరో ముంబైలోని శ్రీ మహాలక్ష్మి ఆలయాన్ని సందర్శించారు. తొలిసారి తమ ముద్దుల కూతురితో ఆలయానికి వెళ్లిన రామ్ చరణ్ దంపతులు.. మహారాష్ట్ర సీఎంను కూడా కలిశారు. అయితే చెర్రీ ప్రస్తుతం సినిమాలతో పాటు బిజినెస్‌లో కూడా దూసుకెళ్తున్నారు. ఇప్పటికే ఎయిర్‌లైన్స్ వ్యాపారం చేస్తోన్న రామ్ చరణ్.. ఏకంగా క్రికెట్‌ టీమ్‌ను కొనుగోలు చేశారు. 

ఐఎస్‌పీఎల్‌ టోర్నీలో హైదరాబాద్‌ను జట్టును కొనుగోలు చేసినట్లు రామ్ చరణ్ ప్రకటించారు. ఈ మేరకు ఆసక్తి కలిగిన ఆటగాళ్లు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరారు. ఈ అద్భుతమైన లీగ్‌లో నాతో పాటు పాలు పంచుకునేందుకు నాతో చేరండి అంటూ పోస్ట్ చేశారు. ఇది చూసిన ‍అభిమానులు రామ్‌ చరణ్‌కు అల్ ది బెస్ట్ చెబుతున్నారు. క్రికెట్‌ లీగ్‌లోనూ చెర్రీ అడుగుపెట్టడంతో మెగా ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. 

>
మరిన్ని వార్తలు