ఏపీలో నాలుగు రోజులు భారీవర్షాలు      

13 Aug, 2020 10:51 IST|Sakshi

మత్స్యకారులు వేటకు వెళ్లొద్దు..

ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరిక

సాక్షి, అమరావతి: వాయువ్య బంగాళాఖాతం, పరిసర ప్రాంతంలో రేపు అల్పపీడనం ఏర్పడనుందని, దీని ప్రభావంతో రాగల 4 రోజుల పాటు  రాష్ట్రంలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని  ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కె. కన్నబాబు తెలిపారు. తీరం వెంబడి గంటకు 45-55 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని, అలలు 3  నుండి 3.5 మీటర్ల ఎత్తు ఎగిసిపడే అవకాశముందని పేర్కొన్నారు. సముద్రం అలజడిగా ఉంటుందని, మత్స్యకారులు  సముద్రంలోకి వేటకు వెళ్లరాదన్నారు.

నేడు విశాఖ, తూర్పు గోదావరి జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం, రాష్ట్రంలో మిగిలిన చోట్ల అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రేపు(శుక్రవారం) విశాఖ, తూర్పు, పశ్చిమ గోదావరి  జిల్లాలో అక్కడక్కడ మోస్తారు నుంచి  భారీ వర్షాలు పడే అవకాశముందని రాష్ట్రంలో మిగిలిన చోట్ల అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని  విపత్తుల నిర్వహణ శాఖ పేర్కొంది.

ఆగష్టు 15న విశాఖ, తూర్పు జిల్లాలో అక్కడక్కడ మోస్తారు నుంచి  భారీ వర్షాలు, రాష్ట్రంలో మిగిలిన చోట్ల అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశముందని పేర్కొంది. ఆగష్టు 16న  విశాఖ, తూర్పు జిల్లాలో అక్కడక్కడ మోస్తారు నుంచి  భారీ వర్షాలు, రాష్ట్రంలో మిగిలిన చోట్ల అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని  విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కె. కన్నబాబు వెల్లడించారు.

మరిన్ని వార్తలు