వారికి జీతం ఎంత పెంచినా తక్కువే: మంత్రి బుగ్గన

3 Dec, 2020 14:09 IST|Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ శీతాకాల సమవేశాల్లో భాగంగా గురువారం ఉద్యోగుల సంక్షేమం- ప్రభుత్వ విధానంపై శాసనమండలిలో స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి‌‌ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమానికి వైఎస్సార్‌​ కాంగ్రెస్‌ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. ఏపీఎస్‌ఆర్‌టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం ఓ చారిత్రాత్మక నిర్ణయమన్నారు. 51,500 మంది ఆర్టీసీ ఉద్యోగులను విలీనం చేయడం వల్ల ఏడాదికి ప్రభుత్వంపై 3 వేల కోట్ల అదనపు భారం పడుతుందన్నారు. ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉందని, ఉద్యోగులను దృష్టిలో పెట్టుకొని ఔట్‌ సోర్సింగ్‌​, కాంట్రాక్ట్‌ ఉగ్యోగుల కోసం కార్పొరేషన్‌ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. దీని వల్ల 70 వేల మంది లబ్ధి పొందుతున్నారని, ఆశా వర్కర్లకు జీతం 3 వేల నుంచి పది వేలకు పెంచినట్లు మంత్రి బుగ్గన తెలిపారు. చదవండి: టీడీపీ ఎమ్మెల్యేపై సీఎం జగన్‌ ఆగ్రహం 

‘ట్రైబల్ హెల్త్ వర్కర్లకు 400 నుంచి ప్రభుత్వం నాలుగు వేలకు పెంచాం. పారిశుద్ద్య ఉద్యోగులకు 12 వేల నుంచి 18 వేలకు పెంచాం. వీరికి ఎంత పెంచినా తక్కువే.. ఎవ్వరూ చేయలేని పని వీళ్లు చేస్తున్నారు. చిన్న జీతాల ఉద్యోగులను ఆదుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. సీపీఎస్ విధానం రద్దు అంశం ప్రాసెస్‌లో ఉంది. మంత్రుల కమిటీ సమావేశం జరుగుతుంది. సీపీఎస్ రద్దుపై ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నాం’ అని తెలిపారు. కాగా గత ప్రభుత్వంలో సీపీఎస్ రద్దు కోసం ఉద్యమించిన ఉద్యోగి రామాంజనేయులను అప్పటి ప్రభుత్వం సస్పెండ్ చేసిందని పేర్కొన్న మంత్రిఆదిమూలపు సురేష్‌ తిరిగి అతన్ని తాము విధుల్లోకి తీసుకున్నామన్నారు. చంద్రబాబుపై కొడాలి నాని ఫైర్‌!

మరిన్ని వార్తలు