జర్నలిస్టులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌

3 Nov, 2023 14:22 IST|Sakshi

సాక్షి, అమరావతి: జర్నలిస్టులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ అందించింది. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల పంపిణీకి కేబినెట్‌ ఆమోదం తెలిపింది.  ప్రతి జర్నలిస్ట్‌కు 3 సెంట్ల స్థలం ఇవ్వాలని కేబినెట్‌ నిర్ణయించింది. ఈ మేరకు ఎన్నికల హామీని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిలబెట్టున్నారు. 

ఎస్ఐపీబీ ప్రతిపాదనలకు.. రూ. 19 వేల కోట్ల పెట్టుబడుల పరిశ్రమల ఏర్పాటు, సమగ్ర కుల గణన, ఏపీలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల పంపిణీ తదితర అంశాలపై చర్చించిన కేబినెట్‌ అందుకుఆమోద ముద్ర వేసింది. 

కులగణనకు ఏపీ కేబినెట్‌ ఆమోదం తెలిపింది. అణగారిన వర్గాల అభ్యున్నతికి కులగణన మరింత ఉపయోగపడుతుందని సీఎం జగన్‌ ఈ సందర్భంగా పేర్కొన్నారు. అదే సమయంలో జ.గనన్న సురక్ష కార్యక్రమానికి కేబినెట్‌ అభినందనలు తెలిపింది. ఈ మేరకు సీఎం జగన్‌ మాట్లాడుతూ.. మంత్రులందరూ జగనన్న సురక్ష కార్యక్రమంలో భాగస్వామ్యులు కావాలని ఆదేశించారు.

చదవండి: ఏపీ కేబినెట్‌ భేటీలో తీసుకున్న నిర్ణయాలివే..

మరిన్ని వార్తలు