పోలీసుల మృతి పట్ల సీఎం వైఎస్‌ జగన్‌ తీవ్ర దిగ్భ్రాంతి

23 Aug, 2021 18:49 IST|Sakshi

సాక్షి,అమరావతి: శ్రీకాకుళం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏఆర్‌ పోలీసుల దుర్మరణంపై ముఖ్యమంత్రి  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర  దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అదేవిధంగా ప్రమాద ఘటనపై డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్   తీవ్ర విచారం వ్యక్తం చేశారు.ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను జిల్లా ఎస్పీ అమిత్ బర్డార్ తో ఫోన్లో మాట్లాడి తెలుసుకున్నారు.

ఏఆర్ కానిస్టేబుళ్లు విధి నిర్వహణలో భాగంగా ప్రతిరోజూ తనకు ఎస్కార్ట్ గా వస్తున్న విషయాన్ని గుర్తు చేసుకుని ధర్మాన కృష్ట దాస్ బాధ పడ్డారు. మరోవైపు ప్రమాద ఘటనా స్థలానికి మంత్రి సీదిరి అప్పల రాజు హుటాహుటిన చేరుకున్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. శ్రీకాకుళం రోడ్డు ప్రమాద ఘటనపై  ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వ భూషణ్ హరిచందన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని గవర్నర్  హరిచందన్ అధికారులను ఆదేశించారు.  బాధిత కుటుంబ సభ్యులకు గవర్నర్ తన హృదయపూర్వక సంతాపాన్ని తెలిపారు.

చదవండి: ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు పోలీసులు మృతి

మరిన్ని వార్తలు