ఉద్యమ కార్యాచరణ సమ్మెను విరమించుకుంటున్నాం: ఉద్యోగ సంఘాల నేతలు

5 Feb, 2022 23:34 IST|Sakshi

సాక్షి, అమరావతి: దాదాపు7 గంటల పాటు మంత్రుల కమిటీతో ఉద్యోగ సంఘాలు జరిపిన సమావేశం ముగిసింది. ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చలు సఫలమయ్యాయి. సమావేశం అనంతరం​ పీఆర్సీ సాధన సమితి  సభ్యులు ఈ అంశాలపై మాట్లాడారు. బండి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ప్రభుత్వం మాకు జరిగిన అన్యాయాన్ని పెద్ద మనసుతో గ్రహించిందని అందుకే అన్ని విషయాలు కూలంకషంగా చర్చించిందని తెలిపారు. తాము అడక్కుండానే 27శాతం ఐఆర్ ఇచ్చారని ,పలువురి జీతాలు పెంచారన్నారు. ముఖ్యమంత్రి గారిని ఆవేదనలో ఏదైనా ఎవరైనా మాట్లాడి ఉంటే అన్యదా భవించవద్దని చెప్పారు. తాము ఇచ్చిన ఉద్యమ కార్యాచరణ సమ్మెను విరమించుకుంటున్నట్లు తెలిపారు.

వెంకట్రామిరెడ్డి, పీఆర్సీ సాధన సమితి ...ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నామని చెప్పారు. సచివాలయ ఉద్యోగులకు హెచ్ ఆర్ ఏ 24 శాతం ఇచ్చేందుకు ఒప్పందం జరిగిందని చెప్పారు. సీసీఎని పునరుద్ధరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్ కాగానే కొత్త స్కేల్ అమలవుతుందని చెప్పారు. తాము మాట తప్పి ఏదైనా మాట్లాడి ఉంటే హృదయ పూర్వక క్షమాపణలను తెలిపారు.

మరిన్ని వార్తలు