కరోనా కట్టడి, వ్యాక్సిన్‌పై ఏపీ కీలక నిర్ణయం

15 Apr, 2021 23:30 IST|Sakshi

విజయవాడ: విజృంభిస్తున్న మహమ్మారి కరోనా వైరస్‌ను కట్టడి చేయడంతో పాటు దానికి విరుగుడుగా చేపట్టిన వాక్సినేషన్ నిర్వహణ కోసం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక ప్రకటన తీసుకుంది. కరోనా కట్టడి, వ్యాక్సినేషన్‌ నిర్వహణ కోసం సీనియర్‌ ఐఏఎస్‌లతో కూడిన ఉన్నతస్థాయి కమిటీని ప్రభుత్వం గురువారం నియమించింది. మొత్తం ఈ కమిటీలో 21 మంది సీనియర్ ఐఏఎస్ అధికారులతో కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్వహణ, 13 జిల్లాలకు 13 మంది సీనియర్ ఐఏఎస్ అధికారులు అదనంగా కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

కోవిడ్ పరీక్షలు, కోవిడ్ వచ్చినవారు పర్యవేక్షణ,104 కాల్ సెంటర్ నిర్వహణ, ఆస్పత్రుల్లో బెడ్లు, వైద్య సేవల ఈ కమిటీ పర్యవేక్షణ చేయనుంది. కోవిడ్ వాక్సినేషన్‌ని ముమ్మరంగా నిర్వహించేలా బాధ్యతలు అప్పగించింది. తక్షణం కోవిడ్ బాధితులకు వైద్య సహాయం అందేలా నిరంతరం కమాండ్ కంట్రోల్ పర్యవేక్షించానుంది. ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ చర్యలతో పాటు రాష్ట్రంలో కరోనా కట్టడిపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేస్తూ కరోనా వ్యాప్తి నివారణకు చర్యలు చేపడుతున్నారు.

మరిన్ని వార్తలు