హజ్‌ యాత్రకు నమోదు చేసుకోండి : ఏపీ హజ్‌ కమిటీ చైర్మన్‌

5 Dec, 2023 12:31 IST|Sakshi
( ఫైల్‌ ఫోటో )

సాక్షి, విజయవాడ : కేంద్ర మైనార్టీ వ్యహహారాల శాఖ వచ్చే ఏడాది(2024) హజ్ వెళ్లే యాత్రికుల కోసం గైడ్‌లైన్స్ విడుదల చేసినట్లు ఏపీ హజ్ కమిటీ చైర్మన్ గౌసల్ ఆజాం తెలిపారు. యాత్రికులు డిసెంబర్ 4 నుంచి 20 వరకు ఆన్ లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరారు. జిల్లాల్లో ఉన్న హజ్ సొసైటీల్లో వాలంటీర్లు రిజిస్ట్రేషన్ చేస్తారని చెప్పారు. 

‘అప్పుడే పుట్టిన పిల్లల నుంచి 70 సంవత్సరాల వయసు వారు హజ్‌ యాత్రకు అర్హులు. రెండేళ్ల లోపల వయసున్న చిన్నారులకు  విమాన ఛార్జీల్లో 10శాతం రాయితీ ఉంటుంది. 40 ఏళ్లు దాటిన ఒంటరి మహిళలు కూడా హజ్‌కి వెళ్ళవచ్చు. విజయవాడలో గతేడాది నుంచి ఎంబారికేషన్ పాయింట్ ఏర్పాటు చేయిస్తున్న సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు. విజయవాడ నుంచి వెళ్తున్న హజ్ యాత్రికులకు విమాన చార్జీల భారాన్ని తగ్గించేందుకు సీఎం జగన్ గతేడాది రూ. 14 కోట్లు విడుదల చేశారు’అని గౌసల్‌ ఆజాం తెలిపారు. 

‘దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీ యాత్రికుల కోసం ఏర్పాట్లు జరిగినట్టు మక్కాలో మాట్లాడుకున్నారు. మే 9 నుంచి జూన్ 20 వరకు హజ్ యాత్ర విడతల వారిగా జరుగుతుంది. యాత్రికులు ఏప్రిల్ 24కల్లా పాస్ పోర్టులు సబ్మిట్ చేయాలి. గతేడాది కంటే మరింత బాగా హజ్ యాత్ర జరగాలని సీఎం జగన్ సూచించారు. యాత్రికులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలని  ఆదేశించారు’ అని గౌసల్‌ వెల్లడించారు. 

ఇదీచదవండి..మిచౌంగ్‌ తుపాను హెచ్చరిక..  అప్‌డేట్స్‌

>
మరిన్ని వార్తలు