పిశాచాల కంటే క్రూరంగా తండ్రీకొడుకుల ఆలోచనలు

5 May, 2021 16:25 IST|Sakshi

సాక్షి, అమరావతి: కరోనా విషయంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేశ్‌పై ట్విటర్‌ వేదికగా వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి తీరుపై మండిపడ్డారు. పిశాచాల కంటే క్రూరాతి క్రూరంగా వారి ఆలోచనలు ఉన్నాయని మండిపడ్డారు. రాష్ట్రంలో కరోనా నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా చర్యలు తీసుకుంటోందని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నాయకత్వంలో రాష్ట్ర కేబినెట్ సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకుందని ఎంపీ విజయసాయిరెడ్డి గుర్తుచేశారు.

ఇదే క్రమంలో బాబు, లోకేశ్‌ చేస్తున్న విమర్శలపై కొన్ని ట్వీట్లు చేశారు. ‘రాష్ట్ర ప్రజలు క్షేమంగా ఉండాలని తండ్రీ కొడుకులు ఎన్నడూ కోరుకోరు. జగన్ గారు విఫలమయ్యారని ఏడవడానికి, దేశమంతా మహమ్మారి అదుపులోకి వచ్చినా ఏపీలో మాత్రం శవాల దిబ్బలు కనిపించాలని ‘వాళ్ల దేవుళ్లకు’ మొక్కుతుంటారు. పిశాచాల కంటే క్రూరాతి క్రూరంగా ఉంటాయి వీళ్ల ఆలోచనలు.’ అని ట్వీట్‌ చేశారు. ‘పాపాలు చేసిన వారిని దేవుడు క్షమిస్తాడేమో కానీ తమను నిలువునా దోచుకుని, మాఫియా పాలనతో పీడించిన బాబులాంటి వారిని ప్రజలు అస్సలు మన్నించరు. వరుస పరాజయాలు అందుకే. నిజాయతీ విలువ తెలియని వ్యక్తులు పరాజయాల భారం కింద నలిగిపోక తప్పదు’ మరో ట్వీట్‌ చేశారు.

చదవండి: ఆక్సిజన్‌ కొరత లేదు.. కరోనా కంట్రోల్‌లోనే

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు