విజయవాడ మీదుగా వెళ్లే పలు రైళ్ల రద్దు 

21 Nov, 2023 05:19 IST|Sakshi

రైల్వేస్టేషన్‌ (విజయవాడ పశ్చిమ):  దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్‌లో జరుగుతోన్న నిర్వహణ పనుల కారణంగా పలు రైళ్లను పూర్తిగాను, పాక్షికంగా రద్దు చేయ­డంతో పాటు మరికొన్నింటిని దారి మళ్లించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ నెల 20 నుంచి 26 వరకు కాకినాడ పోర్టు–విశాఖ(17267/17268), రాజమండ్రి–విశాఖ (07466/07467), మచిలీపట్నం–విశాఖ (17220/17219), గుంటూరు–రాయగడ (17243/17244), గుంటూరు–విశాఖ (17239/17240), బిట్రగుంట–విజయవాడ (07977/­07978), బిట్రగుంట–చెన్నై సెంట్రల్‌ (17237/­17238), విజయవాడ–తెనాలి (07279/07575), విజయవాడ–ఒంగోలు (07461/­07576), విజయవాడ–గూడూరు (07500/07458) రైళ్లను పూర్తిగా రద్దు చేశారు. 

పాక్షికంగా రద్దైనవి: ఈ నెల 20 నుంచి 26 వరకు మచిలీపట్నం–విజయవాడ (07896), విజయవాడ–మచిలీపట్నం (07769), నర్సాపూర్‌–విజయవాడ (07863), విజయవాడ–మచిలీపట్నం (07866), మచిలీపట్నం–విజయవాడ (07770), విజయవాడ–భీమవరం (07283), మచిలీపట్నం–విజయవాడ (07870), విజయవాడ–నర్సాపూర్‌ (07861) రైళ్లను విజయవాడ–రామవరప్పాడు మధ్య పాక్షికంగా రద్దు చేశారు. 

దారి మళ్లించిన రైళ్లు: ఈ నెల 25న భావ్‌నగర్‌–కాకినాడ పోర్టు (12756), ఈ నెల 22, 24 తేదీల్లో బెంగళూరు–గౌహతి (12509), ఈ నెల 22, 24, 25 తేదీల్లో ఛత్రపతి శివాజీ టర్మి నల్‌–భువనేశ్వర్‌ (11019), ఈ నెల 21 నుంచి 26 వరకు ధన్‌బాద్‌–అలిప్పి (13351), ఈ నెల 25న హతియా–బెంగళూరు (18637) 26న హతియా–బెంగళూరు (12835), 24న టాటా–బెంగళూరు (12889), ఈ నెల 23న టాటా–యశ్వంత్‌పూర్‌ (18111) రైళ్లు విజయవాడ, గుడివాడ, భీమవరం జంక్షన్, నిడదవోలు స్టేషన్‌ల మీదుగా దారి మళ్లించారు. 

శబరిమలకు ప్రత్యేక రైళ్లు: శబరిమలకు ఈ నెల 26, డిసెంబర్‌ 3న సికింద్రాబాద్‌–కొల్లం (07129), ఈ నెల 28, డిసెంబర్‌ 5న కొల్లం–సికింద్రాబాద్‌ (07130), 
ఈ నెల 26, డిసెంబర్‌ 3న నర్సాపూర్‌–కొట్టాయం (07119), ఈ నెల 27, డిసెంబర్‌ 4న కొట్టాయం–నర్సాపూర్‌ (07120), ఈ నెల 22, 29, డిసెంబర్‌ 6న కాచిగూడ–కొల్లం (07123), ఈ నెల 24, డిసెంబర్‌ 1, 8 తేదీల్లో కొల్లం–కాచిగూడ (07124), ఈ నెల 23, 30న కాకినాడ టౌన్‌–కొట్టాయం (07125), ఈ నెల 25, డిసెంబర్‌ 2న కొట్టాయం–కాకినాడ టౌన్‌ (07126), ఈ నెల 24, డిసెంబర్‌ 1న సికింద్రాబాద్‌–కొల్లం (07127), ఈ నెల 25, డిసెంబర్‌ 2న కొల్లం–సికింద్రాబాద్‌ (07128) రైళ్లను నడపనున్నారు. 

మరిన్ని వార్తలు