జగనన్న చేదోడు పథకాన్ని ప్రారంభించిన మంత్రి

10 Nov, 2020 14:26 IST|Sakshi

సాక్షి, విజయవాడ: బీసీ శాఖ మంత్రిగా జగనన్న చేదోడు పథకాన్ని ప్రారంభించడానికి అవకాశం రావటం ఆనందంగా ఉందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ పేర్కొన్నారు.  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మానిఫేస్టోలో పెట్టిన ఈ పథకం ఈ రోజు నుంచి అమలు కానుంది. ఈ సందర్భంగా మంగళవారం విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రితో పాటు ఐఏస్‌ అధికారి ప్రవీణ్‌ కమార్‌లు, ఏపీ నాయి బ్రహ్మణ కార్పొరేషన్‌ చైర్మన్‌ ఏనాదయ్యతో పాటు తదితరులు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో మంత్రి జగనన్న చేదోడు పథకాన్ని ప్రారంభించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ... అర్హులైన అబ్దిదారులకు అన్ని పథకాలు అందజేస్తామన్నారు. మొదటి విడతగా 2, 57, 040 మందికి ఈ పథకానికి అర్హులుగా గర్తించి వారికి 247.04 కోట్ల రూపాయలు అందిస్తున్నామన్నారు. గత ప్రభుత్వం లాగా తమ ప్రభుత్వం అర్హులైన వారిని తగ్గించమని, జగనన్న చేదోడు పథకం ద్వారా మొదటి విడతలో 2,47,040 మంది లబ్ధి పొందారని చెప్పారు. ఇవాళ 51, 390 మంది లబ్ది చేకూరుతుందని తెలిపారు. ఈ పథకంలో ఎటువంటి సిఫార్సులు లేకుండా కేవలం అర్హులను వెతికి పట్టుకుని మరి వారికి లబ్ది చేకూర్చుమని చెప్పారు. 

బీసీలను బ్యాక్ వర్డ్ క్లాస్‌గా చూసే రోజుల నుంచి బీసీ అంటే బ్యాక్ బోన్ క్లాస్‌గా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భావించారు. ఆయన సీఎం అయ్యాక 139 కులాలకు 56 కార్పొరేషన్‌లను ఏర్పాటు చేసి ముందుకు నడిపూస్తున్నారన్నారు. గడిచిన ప్రభుత్వాలు ఆరోగ్యశ్రీని నిరారోగ్యశ్రీగా మార్చేశారని పేర్కొన్నారు. వైఎస్‌ జగన్‌ సీఎం అయ్యాక మళ్ళీ ఆరోగ్యశ్రీని 221 జబ్బులకు వర్తింప చేసి, మన రాష్ట్రాంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా ఆరోగ్యశ్రీ అమలయ్యేలా చర్యలు తీసుకున్నారన్నారు. ఇచ్చిన మాట కోసం ఎంత కష్టాన్ని అయిన భరించి సంక్షోభంలో... సంక్షేమం అమలు చేస్తున్న నాయకుడు సీఎం వైఎస్‌ జగన్ అన్నారు. ఒక గోప్ప ఆశయంతో ఈ రోజు జగనన్న చేదోడు పథకాన్ని ప్రారంభించామని, బలహీన వర్గాలకు నాయకుడిగా సేవ చేసేందుకు తనకు బీసీ మంత్రిగా అవకాశం ఇవ్వడం తన అదృష్టమని మంత్రి పేర్కొన్నారు.

అలాగే ఐఏఎస్‌ ప్రవీణ్ కుమార్  మాట్లాడుతూ..  రజక, నాయి బ్రాహ్మణులు, దర్జీలకి ఈ పథకం అమలవుతుందని తెలిపారు.  ఈ పథకం ద్వారా లబ్ది పొందిన వారికి ఏడాదికి 10 వేల చప్పున 5సంవత్సరాలు 50 వేలు నేరుగా వారి అకౌంట్‌కు  జమ అవుతాయన్నారు. 8 కార్పొరేషన్‌ల ద్వారా 51,390  లబ్ధిదారులకు 51.39  కోట్ల రూపాయలు ప్రభుత్వం ఇస్తుందని చెప్పారు. ఏపీ నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ ఏనాదయ్య మాట్లాడుతూ.. దాదాపు 139 బీసీ సబ్ కులాలకు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అయ్యాక ప్రాధాన్యత వచ్చిందన్నారు. సీఎం జగన్ ముఖ్యమంత్రి అయ్యాక గడిచిన ఏడాదిన్నర కాలంలోనే 90శాతం హామీలు అమలు చేశారని, దేశ చరిత్రలోనే అప్లై చేసిన అర్హులందరికి ఈ పథకం అమలు చేసిన ఘనత సీఎం వైఎస్‌ జగన్‌ది అన్నారు. తెలియని కులాలను కూడా బయటకి తీసి వారిని చైర్మన్, డైరెక్టర్‌లుగా నియమించి వారి సమస్యలను పరిష్కరిస్తున్నారని బ్రహ్మణ కార్పొరేషన్‌ చైర్మన్‌ పేర్కొన్నారు. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు