-

మంత్రి వేణుకు అస్వస్థత

28 Nov, 2023 08:41 IST|Sakshi
( ఫైల్‌ ఫోటో )

సాక్షి, అమరావతి: బీసీ సంక్షేమ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ సోమవారం స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఆయన విజయవాడ ప్రభుత్వాస్పత్రికి వెళ్లి వైద్య సేవలు పొందారు.

కోలుకున్న ఆయన అనంతరం మరిన్ని వైద్య పరీక్షల కోసం తాడేపల్లిలోని మణిపాల్‌ ఆస్పత్రిలో చేరారు. మంగళవారం ఉదయం వైద్య పరీక్షల అనంతరం డాక్టర్‌ సలహా మేరకు ఆస్పత్రి నుంచి మంత్రి వేణు డిశ్చార్జ్‌ కానున్నారు. మంత్రి ఆరోగ్యంపై సీఎం వైఎస్‌ జగన్‌ ఫోన్‌ చేసి ఆరా తీశారు.
చదవండి: Fact Check: గంతలు కట్టుకొని ‘గుంతల కథ’

మరిన్ని వార్తలు